పాఠశాలకు కంప్యూటర్ల బహుకరణ
పెనుగంచిప్రోలు స్టూడియో భారత్ ప్రతినిధి

పాఠశాలకు కంప్యూటర్ల బహుకరణ
పెనుగంచిప్రోలు
పెనుగంచిప్రోలు కాకాని వెంకటరత్నం జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థి గుడేటి జీవన్ రావు పాఠశాలకు పది కంప్యూటర్లను అందజేశారు.ప్రధానోపాధ్యాయురాలు కే.జలజ కు ఆయన కంప్యూటర్లను పాఠశాల ఉపాధ్యాయుడు తన మిత్రుడు బాణావతు రాము నాయక్ ద్వారా అందజేశారు.గుడేటి జీవన్ రావు ఆశా కుటీర్ అనే స్వచ్ఛంద సేవా సంస్థలు స్థాపించి వృద్ధులు,వికలాంగులు,అనాధలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.పాఠశాల అవసరాలను గుర్తించి గ్లోబల్ డేటా సంస్థ ద్వారా ఈ కంప్యూటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని జీవన్ రావు తెలిపారు.
నెలవంక కనిపించడంతో ప్రారంభమైన రంజాన్ - https://studiobharat.com/Ramadan-started-with-the-appearance-of-the-crescent-moon
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ముక్కా సత్యనారాయణ,జామా మోహనరావు,ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.పెనుగంచిప్రోలు సుదీర్ఘకాలం ఉపాధ్యాయులుగా పనిచేసిన చార్లెస్ కృపానందం దంపతుల కుమారుడైన జీవన్ రావు పాఠశాలకు అందించిన సేవల పట్ల ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.
What's Your Reaction?






