కౌతవారి అగ్రహారం లో జగన్నన సురక్షా కి ప్రజల నుండి అనూహ్య స్పందన
కే అగ్రహారం స్టూడియో భారత్ ప్రతినిధి
కౌతవారి అగ్రహారం లో జగన్నన సురక్షా కి ప్రజల నుండి అనూహ్య స్పందన
ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయాన్ని అందించిన సర్పంచ్ ఆవుల శ్రీనివాసరావు
కౌతవారి అగ్రహారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలందరికి ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో జగన్నన సురక్షా కార్యక్రమం చేపట్టడం జరిగింది.దీనిలో భాగంగా ప్రభుత్వ విప్,టిటిడి కార్యవర్గ సభ్యులు,స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు ఆదేశాను సారంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో విస్తృతంగా జగన్నన సురక్షా కార్యంలో భాగంగా జగ్గయ్యపేట మండలం,కౌతవారి అగ్రహారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నందు ప్రజల ఆరోగ్యాల కోసం ఉచితంగా వైద్య సేవలను అందించాలని ఉద్దేశంతో జగన్నన సురక్షా కార్యక్రమం చేపట్టడం జరిగింది.ప్రభుత్వ వైద్యనిపుణులు సలహామేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల వద్ద నుండి బ్లడ్ శాంపిల్స్ తీసి,వైద్య పరీక్షలు చేసి వారికి కావలసిన మందులను అందిస్తున్నారు.ఇదే సమయంలో కంటి పరీక్షలు చేసి వారికి ప్రభుత్వం నుండి కళ్ళ జోడులను సైతం ఆర్డలతో అందించడం జరుగుతుంది.
నడవలేని వారిని కౌతవారి అగ్రహారం గ్రామ సర్పంచ్ ఆవుల శ్రీనివాసరావు ప్రత్యేక శ్రద్ధతో దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించి,వారికి మందులను అందించి వారిని ఇంటి వద్దకు చేర్చడంతో పలువురు నుండి మన్ననలను అందుకుంటున్నారు.అంగన్ వాడీ నిర్వాహకులు పౌష్టికాహారాని ఏమి తింటే బాగుంటుందోనని ప్రత్యేక పదార్థాలను చూపిస్తూ వచ్చిన వారికి తెలియజేసారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆవుల శ్రీనివాసరావు,ఉపర్పంచ్ ముల్లగిరి కుమారి, ప్రభుత్వ వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్,గ్రామ పంచాయతీ ఇఈ మల్లయ్య,సచివాలయం అడ్మిన్ ,అంగన్ వాడీ సూపర్ వేజర్ కె సువర్ణ,ప్రభుత్వ వైద్య శాఖ,పంచాయతీ శాఖ,సచివాలయ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ(ఐసిడిఎస్) శాఖల సిబ్బంది మరియు 104,ఏయన్.యంలు,అంగన్ వాడీ లు,ఆశాలు,వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.మెటికల శ్రీనివాసరావు
What's Your Reaction?