పేట బస్సులో గంజాయి కలకలం
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి
పోలీస్ స్టేషన్లో అప్పగించిన డ్రైవర్లు
విచారణ చేస్తున్న ఎస్ఐ డి ఆనంద్ కుమార్
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట డిపో బస్సులో గంజాయి కలకలం లేపింది.జగ్గయ్యపేట డిపో కి చెందిన బస్సు తిరుపతి వెళుతుండగా కావలి వద్ద బస్సులో బ్యాగులను చెక్ చేసిన పోలీసులకు అనుమానాస్పదంగా రెండు బ్యాగులు ఉండటం తో వాటిని ఎవరివని విచారించినా ఎవరు ప్రయాణికులు సమాధానం చెప్పకపోవడంతో,కావలి పోలీస్ వారు మీ డిపోలో అధికారులకు అందజేయమని డ్రైవర్లకు సూచించడంతో,వారి సూచనతో సోమవారం ఉదయం జగ్గయ్యపేట డిపోకు చేరుకున్న డ్రైవర్లు డిపో అధికారులకు వాటిని అందజేశారు.
ఒడిశా ఐటీ దాడుల మొత్తం రూ.351 కోట్లు ....చదవండి.. https://studiobharat.com/Odisha-IT-Attacks ....దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి...
వాటికి జాయింట్ గా వేసి ఉన్న తాళాలను డిపో అధికారులు పగలకొట్టి ఏముందో చూడగా ఒక బ్యాగులో బట్టలు,మరో బ్యాగులో మూడు ప్యాకెట్లలో సుమారు మూడు కేజీల 870 గ్రాములు గంజాయి ఉందని గుర్తించి.డ్రైవర్ల తో ఫిర్యాదు చేయించి జగ్గయ్యపేట ఎస్సై డి ఆనంద్ కుమార్ కు వాటిని అందజేశారు.జగ్గయ్యపేట డి ఎస్సై ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కేసు నమోదు చేసి బస్సు లో గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది. ఎవరైనా మర్చిపోయారా.బస్సులు ప్రయాణ సాధనాలుగా వినియోగించుకొని గంజాయి తరలిస్తున్నారా?నిందితులు ఎవరు అనే కోణంలో విచారణ చేస్తునట్లు జగ్గయ్యపేట పట్టణ ఎస్సై డి ఆనంద్ కుమార్ తెలియజేశారు.
What's Your Reaction?