మద్యం దుకాణాలలో ప్రభుత్వ నిబంధనలు ఎక్కడ

జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Oct 25, 2024 - 06:43
 0  121
మద్యం దుకాణాలలో ప్రభుత్వ నిబంధనలు ఎక్కడ

మద్యం దుకాణాలలో ప్రభుత్వ నిబంధనలు ఎక్కడ 

జగ్గయ్యపేట 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం షాపులను గుడి,బడి, హాస్పిటల్స్,నివాస ప్రాంతాలకు దూరంగా ఏర్పాటు చేయాలని,లిక్కర్ బాటిల్స్ లను విక్రయించడమే తప్పా,కూర్చోని త్రాగడానికి అవకాశం లేదని,దుకాణాల ద్వారానే లిక్కర్ అమ్మాలే తప్పా బెల్ట్ షాపులను ఏర్పాటు చేయకూడదనే నిభందనలు ఉన్నాయి.షాపుల ముందు సిసి కెమెరాల నిఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తెలియజేసిన్నట్లుంది.ఎవ్వరికైతే ప్రభుత్వ లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించారో వారే నిర్వహించాలని ఉంది.

సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రభుత్వ నిబంధనలు ఉండగా జగ్గయ్యపేట పట్టణం,నియోజకవర్గంలో దీనికి విరుద్ధంగా ఆచరణలో మద్యం షాపుల విక్రయదారులు నిభందనలు తుంగలో తొక్కారని ఆరోపణలు ప్రజల నుండి బలమంగా వినిపిస్తున్నాయి.

జగ్గయ్యపేట పట్టణం,నియోజకవర్గంలో గల ప్రస్తుత పలు మద్యం షాపులు గుడి,బడి,నివాస ప్రాంతాలలో ఏర్పాటు చేసారని పలువురు ప్రజల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి.ఇదేకాకుండా మద్యం షాపుల నుండే మద్యం సేవించడానికి గ్లాసులు,తినుబండారాలను అమ్ముతున్నారని తెలుస్తోంది.పలు మద్యం షాపులకు ఆనుకొని సిట్టింగ్ కోసం షెడ్లు,రూములను ఏర్పాటు చేసి మద్యం సేవించడానికి కుర్చీలు బలలను ఏర్పాటు చేసారని తెలుస్తోంది.

ఈ తతంగం అంతా సంబంధించిన ప్రభుత్వ అధికారులకు తెల్సిన కూడా ప్రభుత్వం నిబంధనలను పాటించాలనే సమాచారం చెప్పుతూ చేతులు దులుపుకుంటున్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు చెప్పిన నిభందనలకు ఆచరణలో మాత్రం మద్యం షాపుల నిర్వహణ దీనికి భిన్నంగా ఉండటమే కాకుండా మద్యం అమ్మకాలు బారులను తలపిస్తున్నాయి.మద్యం షాపుల విక్రయ యజమానులకు ప్రభుత్వ అధికారులు అండదండలు ఉండటంతో ప్రభుత్వ నిభందనలకు వ్యతిరేకంగా ఇవ్వని జరుగుతున్నాయని,అధికారుల ఏమి పట్టించుకున్నట్లు లేకపోవడంతో వారి తీరుపట్ల పలువురు ప్రజలు విమర్శలను గుప్పిస్తున్నారు.

మద్యం షాపుల నిర్వహణలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలను నీటి రాతలు కాకుండా ఇప్పటికైన తూచా అధికారులు షాపు యజమానులు ఆచరించేలా చూడాలని పలువురు ప్రజలు ప్రభుత్వ పెద్దలను కోరుతున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow