పచ్చని సంసారంలో చిచ్చు పెడుతోన్న స్మార్ట్‌ ఫోన్‌

స్టూడియో భారత్ ప్రతినిధి

Aug 13, 2023 - 11:42
 0  201
పచ్చని సంసారంలో చిచ్చు పెడుతోన్న స్మార్ట్‌ ఫోన్‌

పచ్చని సంసారంలో చిచ్చు పెడుతోన్న స్మార్ట్‌ఫోన్‌

దాంపత్య బంధం

స్మార్ట్‌ ఫోన్‌లు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. పెళ్లైన దంపతుల మధ్య గొడవలకు మొబైల్‌ కారణంగా నిలుస్తోంది. ఇలా స్మార్ట్ ఫోన్‌ కారణంగా జంటల మధ్య గొడవలు రావడాన్ని ఫబ్బింగ్ అని పిలుస్తారు.ఈ ఫబ్బింగ్ కారణంగా దాంపత్య జీవితాల్లో ఎన్నో గొడవలకు కారణంగా మారుతుంది. ముఖ్యంగా శృంగార జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.ఫబ్బింగ్ కారణంగా భాగస్వాముల మధ్య దూరం పెరుగుతుంది.ఫోన్‌ ఎక్కువగా చూడడం వల్ల భాగస్వామిని పట్టించుకోరని, దీంతో ఇద్దరి మధ్య సన్నిహిత్యం తగ్గే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

అంతేకాకుండా భావోద్వేగాలు ఉండాల్సిన చోట స్మార్ట్‌ ఫోన్‌ రావడంతో ఇద్దరి మధ్య ఎమోషనల్‌ కనెక్షన్‌ తగ్గుతుంది.భాగస్వామి సమస్యలను అర్థం చేసుకోకపోవడం,సోషల్‌ మీడియా అనే ఊహా ప్రపంచంలో గడపడం జంటల మధ్య గొడవలకు కారణంగా మారుతుందని చెబుతున్నారు.ఇదిలాగే కొనసాగితే బంధాలు శాశ్వతంగా దూరమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.భాగస్వామికి తగినంత సమయం కేటాయిస్తూ,స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉంటూ వాస్తవ ప్రపంచంలో జీవించకపోతే బంధం తెగిపోవడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow