ఏపిలో ఏ పార్టీ హవా అయిన బిజెపి పార్టీదే...
స్టూడియో భారత్ ప్రతినిధి
ఏపిలో ఏ పార్టీ హవా అయిన బిజెపి పార్టీదే...
అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్ త్వరలో ప్రారంభం అవ్వబోతుంది.ఏపిలో ప్రధాన పార్టీలు వైకాపా,తెదేపా,జనసేన,బిజెపి,కాంగ్రెస్,వామపక్షాలు తదితర పార్టీల వారు ఎలక్షన్ లో పోటి చేసి వారి గెలుపు గుర్రాలను ఎక్కాలని ప్రయత్నాలు చేస్తున్నారు.2024 ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ప్రత్యేకత ఉంది.
ఎందుకంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్,వామపక్షాలు మినహా మిగిలిన అన్ని పార్టీల వారు బిజెపి మద్దతు కోరుతున్న విషయం అందరికి తెలిసిందే.వైకాపా అధికార పార్టీ మాత్రం దొడ్డి దారిన అంతర్గతంగా బిజెపి తో మిలాకత్ కాగా,యన్.డి.ఏ లో మేము సైతం అంటూ తెదేపా,జనసేన పార్టీలు ముందస్తుగా బిజేపి పార్టీకి పొత్తులను బహిర్గతం చేయడం జరిగింది.తెదేపా,జనసేన వారి యొక్క కార్యకర్తలను,అభిమానులను పొత్తులతో బిజెపి పార్టీకి అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నట్లుందని ప్రజలు భావిస్తున్నారు.
ఇటువంటి పొత్తుల తీరుతో బలమైన వామపక్షాలు సైతం క్రమేపి కనుమరుగు అవుతున్న తరుణంలో బిజెపి వ్యూహాత్మక ఎత్తుగడలతో భాగంగా భవిష్యత్తులో తెదేపా,జనసేన పార్టీలు ఖాళీ అయ్యే పరిస్థితులు లేకపోలేదు.
ఇప్పటికే రాష్ట్రంలో వైకాపా,తెదేపా బలమైన ఎలక్షన్ ప్రత్యర్ధులుగా ఉండగా...
బిజెపి ఆపరేషన్ తీరుతో తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ లో వైఫల్యం చెందగా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం బిజెపి బలపడే పరిస్థితులు లేకపోలేదు.పొత్తులతో బలమైన తెలుగు దేశం,జనసేన పార్టీ కార్యకర్తలను,అభిమానులను బిజెపి వైపు ఆకర్షించేలా ఉందని పలువురు భావిస్తున్నారు.
రాష్ట్రంలో స్వయంగా పోటి బరిలో నిలబడలేని బిజెపి పార్టీ,ఏపి రాష్ట్రంలో ఉన్న వైకాపా,తెదేపా పార్టీలలోని పలు లోపాల వల్ల ఏదో రూపంలో ఏపిలో రాజకీయంగా బలపడే ప్రయత్నాలు చేయడంలో విజయవంతం అయ్యిందనే చెప్పుకోవచ్చు.
ఏపి పొత్తులతో అధికార వైకాపా ఓటమి సంగతి దేవుడెరుగు బలమైన తెదేపా,జనసేన పార్టీల కార్యకర్తలు,అభిమానులను బిజెపి వైపు రాష్ట్రంలో మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు.
ఏపిలో సైతం బలపడాలనే బిజెపి పార్టీ ఆలోచన ఆపరేషన్ లో బిజెపి విజయం సాధించిందనే చెప్పుకోవచ్చు.
పలువురు మేధావులు మాత్రం ప్రాంతీయ పార్టీల పొత్తుల పేరుతో కార్యకర్తలను, అభిమానులను తాకట్టు పెట్టే విధానం కన్న ఏపి రాష్ట్రానికి బిజెపి,కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీల నాయకులకే ఓటు వేయడం ద్వారా ఎపి రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని మేధావులు బావిస్తున్నారు.మెటికల శ్రీనివాసరావు
What's Your Reaction?