అడవులు సంరక్షణే ఇతని జీవిత లక్ష్యం

కారంపూడి స్టూడియో భారత్ ప్రతినిధి

Mar 26, 2024 - 13:27
 0  164
అడవులు సంరక్షణే ఇతని జీవిత లక్ష్యం

అడవులు సంరక్షణే ఇతని జీవిత లక్ష్యం.

అడవిలో నిత్య సంచారి........ఈ కొమెర జాజి 

వివరాల్లోకి వెళితే కారంపూడి గ్రామ నివాసి, నిత్య అడవి సంచారి నల్లమల అడవి, మరియు వివిధ అడవి ప్రాంతాలలో నిత్యం ఏదొక ప్రాంతంలో తిరుగుతూ కనిపిస్తు ఉంటాడు.సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అడవే అతని ఆవాసం.చేతిలో ఒక గోతంలో అడవి అంత కలియచూచుతూ అక్కడక్కడ అడవికి,ప్రాణులకు హాని చేసే వ్యర్ధాలు,త్రాగి పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్,కవర్లు చెత్త చేదారం ఏరి వేసి పూర్తిగా అడవి బయటకు తెచ్చి నాశనం చేస్తుంటాడు.చిన్నతనం నుండే ఈ అడవులు సంరక్షణ కోసం ఏ లాభపేక్ష లేకుండా,ప్రతి రోజు పని చేస్తూ తన జీవితాన్ని,అడవులకు ప్రకృతికి ధారాపోశారు జాజి.

ఇప్పటికే తన చిన్నతనం నుండే,ఎన్నో వేల ఎకరాలలో అడవిలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలు ఏరివేసి ప్లాస్టిక్ పెనుభూతం నుండి అడవిని,ప్రాణులను కాపాడుతున్నాడు.

తొలకరి జల్లుల సమయంలో విత్తనబంతులు ఎత్తయినా కొండలు, గుట్టలు ఎక్కి చల్లుతూ అడవిలో ప్రతి సంవత్సరం కొత్త మొక్కలు మొలిచేందుకు కారణం అవుతున్నాడు.ప్రతి సం "కోటి విత్తనాలు చల్లుతూ ఒక అరుదైన ఘనత కూడా సాధిస్తున్నాడు. వర్షాకాలంలో మొక్కలు నాటుతూ అడవులు అభివృద్ధికి పాటు పాటుపడుతున్నాడు.

అడవులలో అరుదైన మొక్కలు గుర్తిస్తూ నీళ్ళు పోసి కాపాడు, అడవులలో విశ్రాంతి లేకుండా తిరుగుతూ ప్రాణుల వేట జరగకుండా, చెట్లను నరకకుండ కూడా సంరక్షణ చేస్తుంన్నాడు ఈ అడవి ప్రేమికుడు.

తనకు జీవనధారంగా ఉన్న ఒకే ఒక్క ఎకరంలో కూడా సజ్జ జొన్న పంట వేసి సేంద్రియ పద్ధతిలో పండించి పక్షుల కోసమే వదిలేస్తాడు జాజి.

అడవులు సంరక్షణే జాజి వృత్తిగా స్వికరించి తను పని తాను చేసుకొని వెళ్తున్నాడు.33.3% ప్రకృతి అడవులు వృద్ధియే తన జీవితలక్ష్యం అంటాడు ఈ పర్యావరణ పరిరక్షకుడు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow