వాగ్నర్ గ్రూపునకు ఎనిమిది వేల కోట్లు చెల్లించాం
రష్యా స్టూడియో భారత్ ప్రతినిధి
వాగ్నర్ గ్రూపునకు రూ.8వేల కోట్లు చెల్లించాం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
రష్యా :
వాగ్నర్ గ్రూపునకు తమ ప్రభుత్వమే నిధులు అందించిందని, కేవలం ఏడాదిలోనే దాదాపు రూ.8వేల కోట్లు చెల్లించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. రష్యాలో ఇటీవల తిరుగుబాటు చేసి వెనక్కి వెళ్లిన వాగ్నర్ గ్రూపునకు కేవలం ఏడాదిలోనే దాదాపు రూ.8వేల కోట్లకు పైగా చెల్లించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు.ఉక్రెయిన్‌పై చేస్తోన్న సైనిక చర్యలో పాల్గొన్న వాగ్నర్ గ్రూపు సైనికులకు జీతాలు, ఇతర రివార్డులో రూపంలో వీటిని అందించినట్లు తెలిపారు. రక్షణశాఖ అధికారులతో మాస్కోలో నిర్వహించిన సమావేశంలో రష్యా అధ్యక్షుడు ఈ వివరాలు వెల్లడించారు.
‘మే 2022 నుంచి మే 2023 మధ్య కాలంలో వాగ్నర్ గ్రూపు బలగాలకు జీతాలు, ఇతర అలవెన్సుల రూపంలో 86.26 బిలియన్ రూబుల్స్‌ను ప్రభుత్వం చెల్లించింది.సైనిక చర్యలో పాల్గొన్న వారికి అన్ని వనరులను ప్రభుత్వమే సమకూరుస్తోంది. వీటిని రక్షణశాఖ, ప్రభుత్వ బడ్జెట్ నుంచే అందిస్తున్నాం.మనమే ఆ గ్రూపునకు పూర్తిగా నిధులు సమకూర్చాం’ అని రక్షణశాఖ అధికారులతో వ్లాదిమిర్ పుతిన్ వివరించారు.వాగ్నర్ గ్రూపునకు నాయకత్వం వహిస్తోన్న ప్రిగోజిన్ బిలియన్ రూబిళ్లను సంపాదించాడని, వాగ్నర్ గ్రూపుతోపాటు వారి నాయకుడికి చెల్లించిన డబ్బు ఎలా ఖర్చయ్యిందో అనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తారని పుతిన్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా తిరుగుబాటు అంశాన్ని ప్రస్తావించిన పుతిన్ ఒకవేళ అది విజయవంతమైతే మాత్రం దాన్ని మన శత్రువులు అవకాశంగా మలచుకునేవారని అన్నారు.దాంతో కొన్నేళ్లుగా సాధించిన విజయాలను కోల్పోయేవాళ్లమని అభిప్రాయపడ్డారు.
What's Your Reaction?