కెనడా కార్మికుల స్థితిగతులు ఎలా ఉంటాయో తెలుసా

టొరంటో స్టూడియో భారత్ ప్రతినిధి

Oct 28, 2023 - 23:46
 0  97
కెనడా కార్మికుల స్థితిగతులు ఎలా ఉంటాయో తెలుసా

కెనడా కార్మికుల స్థితిగతులు

టొరంటో 

ఇటీవల కెనడాలోని టొరంటో నగరాని అధ్యాయనం చేయగా.ఒక కార్మిక సంఘం కార్యకర్తగా ఆ దేశ ఆర్థిక పరిస్థితులను,కార్మికుల స్థితిగతులను అవగాహన చేసుకునే ప్రయత్నం చేశాను.అందుకు అంతర్జాల (నెట్‌) మాధ్యమాన్ని,కొన్ని పత్రికలను కూడా ఉపయోగించుకున్నాను.రెండో రకపు అధ్యయనంలో కార్మికులతో,ప్రజాతంత్ర ఉద్యమ కార్యకర్తలను అధ్యాయనం చేయగా.పెట్టుబడిదారీ దేశాల ఆర్థిక వ్యవస్థల పరిశీలనకు, కార్మికుల వేతనాల గురించి తెలుసుకోవడానికి కారల్‌మార్క్స్‌ 'పెట్టుబడి' గ్రంథం గైడ్‌గా ఉపయోగపడుతుంది.

అక్కడ ఆర్థిక వ్యవస్థ....

కెనడా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ.అభివృద్ధి చెందిన,చెందుతున్న పెట్టుబడి దారీ ఆర్థిక వ్యవస్థలు ఏవైనా సరే వృత్తాకారంలో ఆర్థిక సంక్షోభాలను పదే పదే ఎదుర్కొంటాయని మార్క్స్‌ ఆనాడే చెప్పాడు.ప్రభుత్వ లెక్కల ప్రకారం కెనడాలో 2023 ఆగస్టులో నిరుద్యోగం 5.5 శాతం.భారత దేశంలో జులైలో నిరుద్యోగం 7.95 శాతం.ఈ లెక్కన కెనడా నిరుద్యోగం ఎక్కువే.అమెరికా,బ్రిటన్‌,ఫ్రాన్స్‌,జర్మనీ తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో ఇటువంటి పరిస్థితులే నెలకొన్నాయి.కెనడాలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తారు.దాన్ని ఇవ్వటాన్ని బట్టి కూడా నిరుద్యోగాన్ని లెక్కిస్తారు.భిక్షాటన చేసేవారు,ఇళ్లు లేక బాధపడేవారు,చెత్త కాగితాలు ఏరుకునే వారు అక్కడక్కడ కనబడతారు.కెనడా దేశ జనాభా 4 కోట్లు.వైశాల్యంలో ప్రపంచంలో రష్యా తరువాత రెండో పెద్ద దేశం.కానీ జనాభా మన రాష్ట్రం కంటే తక్కువ.ప్రభుత్వ లెక్కల ప్రకారం 2021లో 38 లక్షల మంది ప్రజలు సరైన ఇంటి సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డారు.కార్మికుల చేతుల్లో నుండి సంపదలు వాణిజ్య,తనఖా బ్యాంకర్ల చేతుల్లోకి పోతున్నాయని ప్రజాతంత్ర ఉద్యమ మాద్యమాలు పేర్కొంటున్నాయి.కెనడా అభివృద్ధి చెందిన ఉన్నత ఆర్థిక వ్యవస్థ.అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో దానిది పదో స్థానం.జనాభాలో 1.6 శాతం వ్యవసాయం,28.2 శాతం పారిశ్రామిక,70.2 శాతం సర్వీసు రంగాల మీద ఆధారపడ్డారు.పేదరికం దిగువ స్థాయిలో ఉన్నవారు 6.4 శాతం.

మూలవాసుల పాత్ర నామమాత్రమే...

కెనడా ఆర్థిక వ్యవస్థలో మూలవాసుల పాత్ర నామమాత్రం.దేశ జనాభాలో వీరి వాటా 4.9 శాతం.యూరప్‌ నుండి పెట్టుబడులు కెనడా,అమెరికా,ఆస్ట్రేలియా,న్యూజిలాండ్‌ దేశాలకు ఎగుమతి అయ్యాయని,పెట్టుబడులతో పాటుగా ఈ దేశాలకు యూరోపియన్లు వచ్చి స్థిరపడ్డారని పెట్టుబడి గ్రంథంలో మార్క్స్‌ పేర్కొన్నాడు.ఈ క్రమంలో ఈ దేశాల్లో మూలవాసులను ఒక మూలకు నెట్టి,ఘర్షణల్లో చంపి యూరోపియన్లు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు.వీరిలో ఎక్కువ మంది బ్రిటన్‌ ఆ తర్వాత ఇతర యూరప్‌ దేశాల నుండి వచ్చినవారే ఈ దేశాల్లో ఉంటారు.పాలకులు కూడా వీరే.అందుకే కెనడాలో ప్రధాన భాష ఇంగ్లీష్‌,తర్వాత స్థానం ఫ్రెంచ్‌.ఈ దేశాల్లో నగరాలు కూడా యూరప్‌ నగరాల పేర్లతో ఉంటాయి.టొరంటో తర్వాత కెనడాలో రెండో అతి పెద్ద నగరం మాంట్రియల్‌ (ఫ్రాన్స్‌లో కూడా ఈ పేరుతో ఓ నగరముంది).ఈ నగరం ఉన్న క్యూబెక్‌ ప్రావిన్స్‌ వైశాల్యంలో అతి పెద్దది.జనాభాలో దానిది రెండో స్థానం.అందుకే ఫ్రెంచ్‌ భాషది రెండో స్థానం.

కార్మికుల వేతనాలు

ఉన్నత చదువులు చదువుకుని ఫైనాన్స్‌,ఐ.టి రంగాల్లో ఉన్నత ఉద్యోగాలు చేసే వారి గురించి పలు పరిశీలనలో లేదు.నిర్మాణ రంగం,మాల్స్‌,హౌస్‌ కీపింగ్‌,సెక్యూరిటీలో పనిచేసే వారిపై కొంత పరిశీలన చేయగా.వేతనాల పరిశీలనకు కూడా మార్క్స్‌ పెట్టుబడి గ్రంథం గైడ్‌.

కనీస వేతనాలు ఆయా దేశాల ఆర్థికాభివృద్ధిని బట్టి,జీవన వ్యయాన్ని బట్టి,నాగరికత అభివృద్ధిని బట్టి ఉంటాయని ఆనాడే మార్క్స్‌ చెప్పాడు.ఆధునిక కెనడా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో జీవన వ్యయం భారత దేశంతో పోల్చితే అనేక రెట్లు ఎక్కువ.ఇటువంటి ఆర్థిక వ్యవస్థలో పని చేయాలంటే చదువులు,నైపుణ్యాలు కూడా అధిక స్థాయిలో ఉండాలి.

ఫెడరల్‌ (కేంద్ర) ప్రభుత్వం, ప్రొవెన్షియల్‌ (రాష్ట్ర) ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం గత సంవత్సరపు వినిమయ ధరల సూచీ సరాసరిని బట్టి కనీస వేతనాన్ని (గంటకు) ప్రకటిస్తాయి.టొరంటో నగరం ఒంటారియో ప్రావిన్స్‌లో ఉంది.ఈ ప్రావిన్స్‌ లో ఈ సంవత్సరం అక్టోబర్‌ 1 నుండి అమల్లోకి వచ్చిన ఒక గంట పనికి కనీస వేతనం 16.55 కెనడా డాలర్లు.భారత రూపాయల్లో సుమారుగా 993.ఈ మొత్తం కేరళ లాంటి రాష్ట్రంలో ఒక రోజుకు వస్తుందనుకుంటే ఇక్కడ గంటకు వస్తుంది.అంటే ఎనిమిది రెట్లు ఎక్కువ.జీవన వ్యయం కూడా నా లెక్కల్లో సరాసరిన దాదాపు అన్ని రెట్లు ఎక్కువ కనబడుతుంది.స్థలాభావం వలన వివిధ సరుకుల రేట్లను ఇక్కడ ప్రస్తావించడం లేదు.అభివృద్ధి చెందిన దేశం కాబట్టి సహజంగానే జీవన ప్రమాణాలు కూడా భారత కంటే ఎక్కువ స్థాయిలో ఉంటాయి.

విశ్వవిద్యాలయాల్లో చదవటానికి వచ్చి

వివిధ ప్రదేశాల్లో పార్ట్‌ టైమ్‌ వర్కర్లుగా పనిచేసే భారత విద్యార్థులు మాత్రమే తమ వేతనాలను వెల్లడించడానికి సిద్ధపడ్డారు.వీరిలో కొత్తగా చేరిన వారికి గంటకు 12 డాలర్ల నుండి వేతనం ప్రారంభమవుతుంది.18 సంవత్సరాల్లోపు హైస్కూల్‌ విద్య పూర్తి చేసి బయటకు వచ్చి పని చేసే కెనడా విద్యార్థులకు ఇతరులకు నిర్ణయించే కనీస వేతనం కంటే ప్రభుత్వమే తక్కువ వేతనాలు నిర్ణయిస్తుంది.నిర్మాణం,విమానాశ్రయాలు తదితర రంగాల్లో కనీస వేతనాల కంటే ఎక్కువ వేతనాలు వస్తాయి.

కార్మికులు - కార్మిక సంఘాలు

కెనడాలో ఉన్న కార్మిక సంఘాల్లో 'కెనడియన్‌ లేబర్‌ కాంగ్రెస్‌' పెద్దది.దీనిలో 30 లక్షల మంది ప్రభుత్వ,ప్రైవేట్‌ రంగాల సభ్యులు ఉంటారు.అంతర్జాతీయ స్థాయిలో 'ఇంటర్నే షనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాన్ఫెడరేషన్‌'(ఐ.టి.యు.సి)కు అనుబంధంగా ఉంది.10 సంవత్సరాల క్రితం 'కెనడియన్‌ లేబర్‌ కాంగ్రెస్‌' నుండి విడిపోయిన 'యూనిఫర్‌' సభ్యత్వం మూడు లక్షలు.ఇటీవల అమెరికాలో మోటార్‌ కార్మికుల సమ్మె జరిగినప్పుడు.... కెనడా లోని మోటార్‌ కార్మికుల సమ్మె 'యూనిఫర్‌' నాయకత్వంలోనే సాగింది.

శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 65.6 శాతం

2023 సెప్టెంబర్‌లో 64 వేల మంది కొత్తగా ఉద్యోగాల్లోకి వస్తే వారిలో 48 వేల మంది పార్ట్‌టైమ్‌ ఉద్యోగులు.సెప్టెంబర్‌ నాటికి ఉద్యోగాల్లో ఉన్నవారి మొత్తం సంఖ్య 2 కోట్లు దాటింది.శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (ఉద్యోగాల్లో ఉన్నవారు, ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారు) 65.6 శాతం.భారత దేశంలో ఇది 57.9 శాతం.కెనడాలో సరాసరి కనీస వేతనం గంటకు 34.01 కెనడా డాలర్లు.యూనియన్‌లో ఉన్నవారు,యూనియన్‌ లో లేకపోయినా ఉమ్మడి ఒప్పందాల అమలు పరిధిలో ఉన్నవారు 30.9 శాతం.పర్మినెంట్‌ ఉద్యోగాల కోసం పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు చేసే వారు 39.5 శాతం.తాత్కాలిక లేదా కాంట్రాక్ట్‌ ఉద్యోగులు 6.3 శాతం.సరాసరి వేతనంలో 2/3 వంతు కంటే తక్కువ వచ్చే వారి సంఖ్య 19.4 శాతం.వీరిని తక్కువ వేతనాలు వచ్చే వారిగా పరిగణిస్తారు.స్త్రీ,పురుషుల మధ్య ఒక గంట కనీస వేతనంలో తేడా 4.48 డాలర్లు.

రాజకీయాలు...

అధికార పార్టీ లిబరల్‌ పార్టీ.ప్రతిపక్ష పార్టీగా కన్సర్వేటివ్‌,మూడో శక్తిగా న్యూ డెమోక్రాటిక్‌ (ఎన్‌.డి.పి.) పార్టీలున్నాయి.ఎన్‌.డి.పి. ప్రస్తుతానికి వామపక్షం కాకుండా,మితవాద పార్టీగా కాకుండా ఉన్నది.ఇది క్రమేపీ మితవాదం వైపు మొగ్గుతోంది.కెనడాలో అతి పెద్ద కార్మిక సంఘం న్యూ డెమోక్రాటిక్‌ పార్టీ ప్రభావంలో ఉంది.ప్రస్తుతం కార్మిక సంఘాల్లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ కెనడా ప్రభావం తక్కువ.1940,1950 ప్రాంతాల్లో పార్లమెంట్‌ లో కమ్యూనిస్టులకు కొద్ది సీట్లు ఉండేవి.ఆ కాలంలో కార్మిక సంఘాలపై కమ్యూనిస్టుల ప్రభావం ఉంది.అమెరికాలో కమ్యూనిస్టులపై జరిగిన దుష్ప్రచార ప్రభావం కెనడాపై పడింది.కమ్యూనిస్టులను కార్మిక సంఘాల నుండి బహిష్కరించారు.

అమెరికాలో బ్రిటన్‌ పాలనకు వ్యతిరేకంగా పెద్ద స్వాతంత్య్ర పోరాటం చేసి విజయం సాధించారు.కెనడాలో దీనికి భిన్నంగా బ్రిటీష్‌ మహారాణికి విశ్వాసపాత్రులుగా ఉండి స్వాతంత్య్రం తెచ్చుకున్నారు.అందుకే ఇప్పటికీ కరెన్సీ నోట్లపై మహారాణి ఫోటో ఉంటుంది.ఇప్పుడు కింగ్‌ ఛార్లెస్‌ ముద్ర రాబోతోంది.ప్రధాన మంత్రి సలహాపై మహారాణి/రాజు గవర్నర్‌ జనరల్‌ను నియమిస్తారు. ప్రభుత్వ భూములను కెనడాలో ఇప్పటికీ క్రౌన్‌ ల్యాండ్స్‌(రాచ భూములు)గా పిలుస్తారు.అయితే బ్రిటన్‌ రాణి/రాజు పాత్ర పేరుకు మాత్రమే కొనసాగుతోంది.అధికారాలన్నీ ఎన్నికైన కెనడా ప్రభుత్వానివే.

ఇతర విశేషాలు...

కెనడా పర్యటనలో కొంత అధ్యయనానికి తోడ్పడిన అంశాలను కూడా ప్రస్తావించాలి.ఉత్తర అమెరికాలో ఉన్న ఐదు మహా సరస్సుల (గ్రేట్‌ లేక్స్‌)లో ఇది ఒకటి.దీని ఒడ్డునే కాలిబాటలు,పార్క్‌లు,లేక్‌ బొలీవార్డ్స్‌ (విశాలమైన కాలిబాటలు గల రోడ్లు) ఉంటాయి.

టొరంటో ట్రాన్స్‌పోర్టు కమిషన్‌ (ప్రభుత్వ సంస్థ) ఆధ్వర్యంలో సబ్‌ వే రైళ్లు,స్ట్రీట్‌ కార్లు,బస్సులు ఒక దానికి మరొకటి సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మంచి సర్వీసునిస్తున్నాయి.కొంత అధ్యయనానికి ఈ రవాణా కూడా తోడ్పడింది.టొరంటో నగరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్‌ స్థాయిలో ఉన్నాయి.

టొరంటో అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సందర్భంలో చూసిన వివిధ దేశాల సినిమాలు,ఆర్ట్‌ షో,ఆర్ట్‌ గ్యాలరీ,ఓంటారియో మ్యూజియం,బేస్‌ బాల్‌ గేమ్‌,వైన్‌ అండ్‌ డైన్‌ మా పర్యటనలో ఉన్న అదనపు ఆకర్షణ.కెనడాలో మాదక ద్రవ్యాలు అధికారికంగానే వాడవచ్చు.వాటిని అమ్మే షాపు కూడా చూశాము.ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ లో 'మారియోనా'ను సేవించేవారిని చూడవచ్చు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow