అమెరికా లో రోడ్డు ప్రమాదం
ఐదుగురు అమలాపురం వాసుల మృతి..! టెక్సాస్ స్టూడియో భారత్ ప్రతినిధి
అమెరికాలో రోడ్డు ప్రమాదం..ఐదుగురు అమలాపురం వాసుల మృతి..!
టెక్సాస్:
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.టెక్సాస్ హైవేలో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది..
అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది..
జాన్సన్ కౌంటీలో ఉన్న 67వ నంబరు హైవేపై మినీవ్యాన్ ను ఓ ట్రక్కు ఢీకొట్టింది.ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.మృతుల్లో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమలాపురం వాసులుగా తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉందన్నది ఇంకా తెలియరాలేదు..
ఈ ప్రమాదం పై తానా సభ్యులు ఈనాడు.నెట్‌తో మాట్లాడుతూ..బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని తెలిపారు.అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ సూచన మేరకు తానా ట్రెజరర్ అశోక్ కొల్లా,ఫౌండేషన్ ట్రెజరర్ పోలవరపు శ్రీకాంత్.. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.
What's Your Reaction?