సేవ్ వాటర్-సేవ్ లైఫ్ సైకిల్ సంపూర్ణ శుక్లా యాత్ర
చిల్లకల్లు స్టూడియో భారత్ ప్రతినిధి

సేవ్ వాటర్,సేవ్ లైఫ్ సైకిల్ సంపూర్ణ శుక్లా యాత్ర
చిల్లకల్లు
జగ్గయ్యపేట మండలం, చిల్లకల్లు హైవే కోనసీమ రుచులు భోజనం హోటల్ వద్ద సేవ్ వాటర్,సేవ్ లైఫ్ అంటూ సైకిల్ తొక్కుకుంటూ సంపూర్ణ శుక్లా యువకుడు తారాసబడాడు.వివరాలలోకి వెళ్ళితే సంపూర్ణ శుక్లా ఆకాశ్ వాణి రేడియో జాకీ గా పని చేస్తూ , దానిని వదిలి వేసి త్రాగు నీరు లేకపోతే మనిషి మనుగడ లేదని,భవిష్యత్తు తరాలకు స్వచ్చమైన త్రాగునీరు అందించే ఉద్దేశ్యంతో ది:03-ఆగస్టు-2023 తేదిన అహ్మదాబాద్ నుండి ఈ సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగిందని సంపూర్ణ శుక్లా తెలియజేశారు.
ఈ యాత్ర ద్వారా భారత దేశంలోని సుమారు ఒక్క కోటి మంది ప్రజలకు త్రాగునీరు పై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో రెండు సంవత్సరాల పాటు ఈ కార్యక్రమాని స్వచ్చందంగా చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.ఇప్పటికే గుజరాత్,మహారాష్ట్ర,గోవా,కర్నాటక,కేరళ,తమిళనాడు,ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలలో 5314 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర పూర్తి చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు.ఇప్పటికే ప్రపంచంలో ఒక్క శాతం మాత్రమే త్రాగునీరు ఉందని, గుజరాత్ రాష్ట్రంలో నీటి ఎద్దడి మూలానా త్రాగునీరు కోసం దూర ప్రాంతాల నుండి బిందెలతో తెచ్చుకుంటున్నారని ఆయన తెలియజేశారు.
పొల్యూషన్ ఎఫెక్ట్ వల్ల,వాతావరణ సమతుల్యత మూలానా త్రాగునీరు తగ్గుతుందని,దీని మూలంగా భవిష్యత్తు తరాలకు స్వచ్చమైన నీరు కొరవడే అవకాశం ఉందని ఆయన అన్నారు.జల్ కేలియే ఛల్ ప్రొగ్రాం ద్వారా సేవ్ వాటర్,సేవ్ లైఫ్,జాయిన్ హ్యుమానిటీ, పర్యావరణం కోసం స్వచ్చ బనాన్ హై అంటూ దేశం మొత్తం సైకిల్ యాత్ర చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.
ఇప్పటికైన ప్రజలు నీటిని వృద్ద చేయవద్దని, పొల్యూషన్ తగ్గించడానికి మన వంతుగా వాహనాలను పక్కన పెట్టి సైకిల్ వాడటం మూలానా అటూ పొల్యూషన్ తగ్గి ఆరోగ్యం మెరుగు పడుతుందని,ప్లాస్టిక్ వాడకాలు వద్దని, పర్యావరణాని కాపాడుకుందాం,భవిష్యత్తు తరాలకు స్వచ్చమైన త్రాగునీరు అందిదామని సంపూర్ణ శుక్లా తెలియజేశారు.సేకరణ మెటికల శ్రీనివాసరావు
What's Your Reaction?






