కట్టలేరులో ఇసుక అక్రమ రవాణా
పెద్దకొమిర స్టూడియో భారత్ ప్రతినిధి

గంపలగూడెం మండలంలో ప్రధాన నీటి వనరైన కట్టలేరు నందు పెద్దకొమిర రేవు నుంచి ఇసుక అక్రమ రవాణా అవుతుంది.ఐదు ట్రాక్టర్లు,రెండు డోజర్లతో ఇసుకను అధికారుల కన్నుగప్పి ఇసుక మాఫియా బ్యాచ్ ఈరవాణాకు పాల్పడ్డారు.ఇసుకను చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రక్ రూ.3వేల నుంచి 4వేల వరకు విక్రయించి ఇసుక మాఫియా బ్యాచ్ జేబులు నింపుకొంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఈ విషయమై ఎంపీడీవో వై పిచ్చిరెడ్డిని వివరణ కోరగా ఏ రేవు నుంచి కూడా ఇసుక రవాణాకు ఈ రోజు ఎవరికీ అనుమతి ఇవ్వలేదని,సంబంధిత ట్రాక్టర్లను అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు తెలిపామన్నారు.దీనిపై ఎస్ఐ మాట్లాడుతూ సిబ్బందిని పంపి ట్రాక్టర్లను స్వాధీన పరుచుకుంటున్నట్లు వివరించారు.ఇదిలా ఉండగా ఇసుక అక్రమ రవాణా సమాచారాన్ని ఎంపీడీవోకు తెలిపామని,కొందరు తమ ఇష్టానుసారంగా ఇసుక అక్రమ రవాణా చేసి అక్ర మార్జన గావిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నాయకులు ఇడుపులపాటి రాంబాబు తెలిపారు.
What's Your Reaction?






