తెలంగాణ క్యాబినెట్ భేటీ షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ

హైదరాబాద్‌ స్టూడియో భారత్ ప్రతినిధి

May 19, 2024 - 17:29
 0  7
తెలంగాణ క్యాబినెట్ భేటీ షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ

తెలంగాణ క్యాబినెట్ భేటీ షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ

హైదరాబాద్‌:

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు ఎన్నికల సంఘం(ఈసీ) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్‌ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని..రైతు రుణమాఫీ,ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని పేర్కొంది. రాష్ట్ర సచివాలయంలో శనివారం జరగాల్సిన మంత్రిమండలి సమావేశం వాయిదా పడిన విషయం తెలిసిందే.. 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు శనివారం సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా ఈసీ నుంచి అనుమతి రాలేదు. దీంతో రాత్రి 7 గంటలకు సమావేశం వాయిదా వేసి వెళ్లిపోయారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్‌ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలు, జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ, రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుండగా.. పునర్విభజన చట్టంలో ఇప్పటివరకు ఏపీ, తెలంగాణల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలను మంత్రిమండలి భేటీలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.కానీ,ఈసీ తాజా ఆదేశాలతో పలు అంశాలపై చర్చ ఉండబోదని తెలుస్తోంది..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow