నాటా మహాసభలలో పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
కాలిఫోర్నియా స్టూడియో భారత్ ప్రతినిధి
నాటా మహాసభలలో పాల్గొనేందుకు అమెరికా చేరుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
కాలిఫోర్నియా
అమెరికా దేశంలోని డల్లాస్ నగరంలో శనివారం నుండి మూడు రోజుల పాటు జరిగే నాటా (నార్త్ అమెరికా ఇన్ తెలుగు అసోసియేషన్) మహాసభలకు ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేరుకున్నారు. ఈయనకు ప్రవాసాంధ్రులు, అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడిన ప్రముఖ కార్డియాలజిస్ట్, మైలవరం మండలం వెల్వడం ప్రముఖులు, ప్రముఖ దాత లకిరెడ్డి హనిమిరెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త గోగులమూడి సీతారామిరెడ్డి (బుల్లి) తదితరులు ఘన స్వాగతం పలికారు.
అమెరికా దేశంలోని డల్లాస్ నగరంలో మూడు రోజులు పాటు జరిగే నార్త్ అమెరికా ఇన్ తెలుగు అసోసియేషన్(నాటా) మహాసభలలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొంటారు.ఇదిలా ఉండగా అమెరికా దేశంలోని డల్లాస్ నగరం చేరుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు శనివారంనాడు ప్రవాసాంధ్రులు అనేకమంది ఆయనకు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు.యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.కాగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తో పాటు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పునూరు గౌతమ్ రెడ్డి,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ్ రెడ్డి కూడా ఉన్నారు.
What's Your Reaction?