బహుజనుల ఓటర్లను ఆకర్షిస్తున్న ప్రధాన పార్టీలు
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి
బహుజనుల ఓటర్లను ఆకర్షిస్తున్న ప్రధాన పార్టీలు
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రాంతంలో సుమారు ఒక్క లక్ష యనబై వేలకి పైబడి ఓటర్లున్నట్లు తెలుస్తోంది.వీటిలో యస్.టి,యస్.సి,బిసి,మైనారిటీ వర్గాల వారు సుమారు ఒక్క లక్ష ఇరవై వేల మంది ఓటర్లు మొత్తంగా ఉన్నారని ఆయా వర్గాల వారి అభిప్రాయం.ఓసిలో కమ్మ,రెడ్డి,కాపు,వైశ్య, బ్రాహ్మణలు తదితర ఓటర్లు ఉన్నారు.ఇప్పటికే ముక్త్యాల రాజా గారి వంశీయులు ఓసి వర్గాలలో మెజారిటీగా ఉండటమే కాకుండా సుమారు యాభై సంవత్సరాల పాటు జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రాంతంలో శాసనసభ్యులుగా ఎన్నుకోబడి ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారు.
మాజీ మంత్రి నెట్టెం రఘురాం ఈ సామాజిక వర్గం నుండి చివరి సారిగా ఉన్నారు.తదుపరి సామినేని విశ్వనాథం తనయులు సామినేని ఉదయభాను కాపు వర్గంలో సుమారు పదిహేను సంవత్సరాలుగా ప్రస్తుతం శాసనసభ్యునిగా ఉండగా,వైశ్య సామాజిక వర్గం నుండి మాజీ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) పది సంవత్సరాల పాటు శాసనసభ్యులు గా పని చేసి ఉన్నారు.
ప్రస్తుతం 2024 ఎన్నికల బరిలో ప్రస్తుత యంయల్ఏ సామినేని ఉదయభాను వైకాపా నుండి,మాజీ యంయల్ఏ శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) తెలుగు దేశం పార్టీ నుండి ఆయా పార్టీల వారు అధికారికంగా జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ ఎన్నికల బరిలో యంయల్ఏ అభ్యర్ధులుగా ప్రకటించిన సంగతి విదితమే.
మెజారిటీ ఓటర్లుగా ఉన్న బహుజనులైన యస్.టి,యస్.సి,బిసి, మైనారిటీ ఓటర్లకు మేమే వారి అభ్యున్నతికి కృషి చేసామని ఇరుపార్టీల వారు ప్రచారం చేసుకుంటున్నారు.వారిని ఇరుపార్టీల వారు గాళాలు వేస్తూ ఆకర్షిస్తూ ఆయా పార్టీల వారు బుట్టలో వారిని వేసుకుంటూ బల బలాను ప్రదర్శిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.ఇప్పటికి ఆ రెండు ప్రధాన పార్టీల వారు బహుజనుల కుటుంబాల వారిలో ఎన్ని కుటుంబాల వారిని ఆర్థికంగా,సామాజికంగా వారు జగ్గయ్యపేట నియోజకవర్గ స్థాయిలో ఏమి చేసారో చెప్పగలరా అంటూ సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు అడుగుతున్నారు.
ఇది ఇలా ఉండగా అగ్రవర్ణంలో మెజారిటీ కమ్మ నాయకులను కనీసం పట్టించుకోవడం లేదని ఆ సామాజిక వర్గంలోని బహిరంగంగానే వారి కుల సంఘాలలో చర్చలు సైతం బహిర్గతం అయిన సంగతి ప్రజలందరు చూసారు.ఇదే కాకుండా ఆ సామాజిక వర్గంలోని కొందరు నాయకులు బహిరంగంగానే వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని కాబట్టే ఇండిపెండెంట్ గా నైన పోటీ చేస్తామని వారంటున్నారు.
ఇప్పటికే ఓటర్లు ఇరుపార్టీల నాయకులు గెలిచిన తరువాత అరకొరగా నియోజకవర్గాని అభివృద్ధి చేసి,వారి స్వలాభమే ప్రాధాన్యతగా ముందుకు వెళ్ళుతున్నారని ప్రజలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.అందుకే బహుజనుల ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు తెలియజేస్తున్నారు.దీనితో తెలివిమీరిన ఓటర్లు నాయకులు తానా అంటే తందానా అంటూ,ఆడిందే ఆట పాడిందే పాటా అంటూ నాయకులకు నిద్రపటనివ్వకుండా చేస్తున్నారని తెలుస్తుంది.మరి వీరిరువురిలో ఓటర్లు ఎన్నికలలో ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.
What's Your Reaction?