కొత్త కుట్రకు తెరలేపిన జగన్, కేసీఆర్
విజయవాడ స్టూడియో భారత్ ప్రతినిధి
కొత్త కుట్రకు తెరలేపిన జగన్, కేసీఆర్
అమరావతి:
తెలంగాణలో పోలింగ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ (Jagan), కేసీఆర్ (KCR) కొత్త కుట్రకు తెరలేపారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) ఆరోపించారు..
ఈ సందర్భంగా గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..నాగార్జునసాగర్ వద్ద తెలంగాణ, ఆంధ్ర పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించటం వెనక ఎన్నికల లబ్ధి ఉందని విమర్శించారు.పట్టిసీమలో నీళ్లు ఉన్నా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి మనస్కరించటం లేదని, తెలంగాణలో సెంటిమెంట్ ద్వారా లబ్ధి పొందేందుకే ఈరోజు నాగార్జునసాగర్ వద్ద హైడ్రామా నెలకొందని.. ఇది జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ అని ఆరోపించారు. నీటి సమస్యను ఇరు తెలుగు రాష్ట్రాలు చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని రామకృష్ణ సూచించారు..
హైదరాబాద్ సహా జిల్లాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రారంభం ....చదవండి.. https://studiobharat.com/Distribution-of-election-material-has-started-in-districts-including-Hyderabad ....దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి...
What's Your Reaction?