హైదరాబాద్‌ సహా జిల్లాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రారంభం.

హైదరాబాద్‌ స్టూడియో భారత్ ప్రతినిధి

Nov 29, 2023 - 18:47
 0  13
హైదరాబాద్‌ సహా జిల్లాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రారంభం.

హైదరాబాద్‌:

తెలంగాణ వ్యాప్తంగా గురువారం జరగనున్న ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు.. డీఆర్‌సీ కేంద్రాలకు పోలింగ్‌ సిబ్బంది చేరుకుంటున్నారు. ఈవీఎంలు, ఇతర సామగ్రిని అధికారులు వారికి అందజేస్తున్నారు. పోలింగ్‌ సిబ్బంది బుధవారం సాయంత్రం లోపు కేంద్రాలకు చేరుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో 1.85లక్షల మంది విద్యార్థులు పాల్గొననున్నారు. 27,094 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలింగ్‌ ప్రక్రియ పరిశీలనకు 22వేల మంది అబ్జర్వర్లు, స్క్వాడ్లను నియమించారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow