విమానం మునిగిపోయినా ప్రయాణికులు సురక్షితం

మార్సెయిల్ స్టూడియో భారత్ ప్రతినిధి

Jul 31, 2023 - 12:13
 0  28
విమానం మునిగిపోయినా ప్రయాణికులు సురక్షితం

విమానం మునిగిపోయినా ప్రయాణికులు సురక్షితం

మార్సెయిల్‌(ఫ్రాన్స్‌):

ఇంజిన్‌ వైఫల్యం చెందడంతో ఓ పైలట్‌ విమానాన్ని సముద్రంలోనే అర్ధాంతరంగా దించేశాడు.విమానం మునిగిపోయినా అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.ఫ్రాన్సులోని మధ్యధరా సముద్ర తీరం ఫ్రెజుస్‌ వద్ద ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో చోటుచేసుకుంది.తీరానికి మరో 600 మీటర్ల దూరం ఉందనంగా సెస్నా 177 రకం చిన్నపాటి పర్యాటక విమానం ఇంజిన్‌లో లోపం ఏర్పడింది.దీంతో, పైలట్‌ సముద్ర జలాల్లోనే అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు.

ఇది కూడా చదవండి..https://studiobharat.com/Precautions-to-be-taken-for-wet-crops.. దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి.

అత్యవసర విభాగం సిబ్బంది అక్కడికి చేరుకునే అందులోని ముగ్గురినీ రక్షించారు.‘ఫ్రెజుస్‌ బీచ్‌లో జనం రద్దీ ఎక్కువగా ఉంది. బీచ్‌లో అత్యవసర ల్యాండింగ్‌ వారికి అపాయం కలుగుతుందని పైలట్‌ భావించాడు.దీంతో,సమయస్ఫూర్తితో వ్యవహరించి బీచ్‌లో కాకుండా దగ్గర్లోని∙సముద్ర జలాల్లో ల్యాండ్‌ చేశాడు.ఇందుకు ఎంతో నైపుణ్యం కావాలి.అదృష్టమూ కలిసి రావాలి’ అని సహాయక సిబ్బంది తెలిపారు.ఈ ఘటనలో విమానం సముద్రంలో మునిగిపోయింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow