విజయవాడలో 'రాన్' అవుట్‌లెట్‌ ప్రారంభం - సినీ నటి నేహా శెట్టి సందడి

విజయవాడ స్టూడియో భారత్ ప్రతినిధి

Mar 2, 2024 - 05:30
 0  8
విజయవాడలో 'రాన్' అవుట్‌లెట్‌ ప్రారంభం - సినీ నటి నేహా శెట్టి సందడి

విజయవాడ -

ఫ్యాషన్ ప్రియుల మనస్సు దోచే 'రాన్' అవుట్‌లెట్‌ను విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గరలోని వీఎస్ఎన్ మాల్‌లో డీజే టిల్లు ఫేమ్, సినీ నటి నేహా శెట్టి గురువారం ప్రారంభించారు.రాన్ యూ ఎస్ పీ ఎల్ (యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్ ప్రైవేట్ లిమిటెడ్) యాజమాన్యంలో ఉంది. ఇది భారతదేశంలో ఫ్యాషన్‌ మార్గదర్శకులైన అంజనా రెడ్డిచే స్థాపించబడింది.ఈ సందర్భంగా నేహా శెట్టి మాట్లాడుతూ ఈ అవుట్‌లెట్‌ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఫ్యాషన్ అంటే ఇష్టపడే వారికి ఇది సరైన ఎంపిక అవుతుందన్నారు.ఈ సందర్భంగా యూ ఎస్ పీ ఎల్ సహ వ్యవస్థాపకుడు,సీవోవో విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ రాన్ దేశంలో 75 ప్రత్యేకమైన బ్రాండ్ అవుట్‌లెట్‌లను కలిగి ఉందన్నారు.ఈ స్టోర్లో అధునాతన టీ-షర్టులు,షర్టులు,జీన్స్,స్లిమ్-ఫిట్ ప్యాంటులు,కార్గోలు,క్యాజువల్ జాకెట్లు,క్యాజువల్,సెమీ ఫార్మల్ గల 250 పైగా డిజైన్లు ఉన్నాయన్నారు.వీటి ధర రూ.999 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. రాన్ పురుషుల దుస్తుల కలెక్షన్ విరాట్ కోహ్లీ లేబుల్ డిజైన్ బృందంతో కలిసి రూపొందించారని చెప్పారు. ఈ బ్రాండ్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత శైలి, ఫ్యాషన్ సెన్సిబిలిటీలను ప్రతిబింబిస్తుందన్నారు. 

ఈ బ్రాండ్‌ యువతలో ఒక ప్రముఖ బ్రాండ్‌గా నిలిచిందన్నారు.దేశంలోని ప్రధాన నగరాల్లో విస్తరణపై దృష్టి సారించామన్నారు.ఈ విస్తరణ‌ ఉనికి కోసం కాదని, ఫ్యాషన్ ప్రియులతో ఉన్న బఙధాన్ని మరింత పెంచుకోవడానికి అన్నారు.నాణ్యత గల దుస్తులను అందించడమే కాకుండా కస్టమర్లతో కనెక్ట్ అయ్యే ప్రత్యేక బ్రాండ్ అనుభవాన్ని అందించడం కూడా అన్నారు.రాన్ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాధారణ పురుషుల దుస్తుల బ్రాండ్‌లలో ఒకటిగా అవతరించిందని తెలిపారు.విజయవాడలోని కొత్త స్టోర్ యువతను ఆకట్టుకోనుందన్నారు.రాన్ భారతదేశంలో ప్రముఖ బ్రాండ్‌గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. రాన్ తన మొదటి ప్రత్యేక అవుట్‌లెట్‌ను 2016లో హైదరాబాద్‌లో ప్రారంభించిందని తెలిపారు.సందడి చేసిన నేహా శెట్టి విజయవాడలో 'రాన్' ప్రారంభోత్సవానికి విచ్చేసిన నేహా శెట్టిని చూసేందుకు జనం ఎగబడ్డారు.ఆమె వస్తుందని ముందే తెలియడంతో ఉదయం నుంచే జనం బారులు తీరారు.దీంతో ఆ ప్రాంతం ఆమె అభిమానులతో కిక్కిరిసిపోయింది.షోరూమ్ ప్రారంభించిన తరువాత అందరికి అభివాదం చేశారు.హాయ్ విజయవాడ అంటూ హుషారెత్తించారు. అభిమానులకు సెల్ఫీలిచ్చారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow