కాణిపాకం గణపయ్యకు ఇద్దరు దాతల భారీ విరాళం
కాణిపాకం స్టూడియో భారత్ ప్రతినిధి
విఘ్నాలను తొలగించే ఏకైక దేవుడు..
కాణిపాకం గణపయ్యకు ఇద్దరు దాతల భారీ విరాళం..
రూ.5 కోట్ల విలువైన 20 బంగారు బిస్కెట్ల కానుకఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం.ఈ క్షేత్రంలో బావిలో వెలసిన వినాయకుడు భక్తులకు వరాలను ఇస్తూ వరసిద్ధి వినాయకస్వామిగా పూజలను అందుకుంటున్నాడు.వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ వినాయకుడు విగ్రహం పెరుగుతూ ఉంటుందని భక్తుల నమ్మకం.
సత్యానికి మారుపేరుగా నిలిచిన వరసిద్ధి వినాయకస్వామిని నిత్యం భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.తాజాగా సత్య ప్రమాణ దైవం విఘ్నాలకధిపతి వరసిద్ధి వినాయకస్వామికి ఆరు కిలోల బంగారు బిస్కెట్లు కానుకగా ఇచ్చారు ఇద్దరు భక్తులు.ఎన్నారైలు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్ 20 బంగారు బిస్కెట్లను స్వామివారికి కానుక అందజేశారు. ఈ కానుకల విలువ 5 కోట్ల ఉంటుందని తెలుస్తోంది. భక్తులు ఇచ్చిన 6 కేజీలు బంగారు బిస్కెట్లను స్వామివారి అంతరాలయం, బంగారు వాకిలి నిర్మాణానికి ఆలయ అధికారులు ఉపయోగించునున్నారు.
What's Your Reaction?