ఉచిత బియ్యం బదులు డబ్బులు
బెంగుళూరు స్టూడియో భారత్ ప్రతినిధి
ఉచిత బియ్యం బదులు డబ్బులు.. కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం
బెంగళూరు:
కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ (Congress) ఇచ్చిన ఐదు హామీల్లో ఒకటైన అన్నభాగ్య పథకం (Anna Bhagya scheme) అమలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి..
ఈ పథకాన్ని జులై 1 నుంచి అమల్లోకి తీసుకురావాల్సి ఉండగా.. అందుకు అవసరమైన బియ్యం సేకరణ సాధ్యం కావట్లేదు. దీంతో సిద్ధరామయ్య (Siddaramaiah) సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత బియ్యానికి బదులుగా నగదు ఇస్తామని ప్రకటించింది. కిలో బియ్యానికి రూ.34 చొప్పున ఐదు కిలోల బియ్యానికి (Ration Rice) సమానమైన డబ్బును బీపీఎల్ ఖాతాదారుల (BPL card holders) బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది..
What's Your Reaction?