శ్రీలంకపై సత్తా చాటిన న్యూజిలాండ్

బెంగళూరు స్టూడియో భారత్ ప్రతినిధి

Nov 10, 2023 - 10:46
 0  13
శ్రీలంకపై సత్తా చాటిన న్యూజిలాండ్

శ్రీలంకపై సత్తా చాటిన న్యూజిలాండ్

హైదరాబాద్:

ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఇవ్వాల గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ సత్తా చాటింది.

బెంగళూరు వేదిక జరిగిన

ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

ముందుగా పటిష్టమైన బౌలింగ్ తో తక్కువ స్కోరుకే శ్రీలంకను కట్టిడి చేసిన కివీస్.. స్వల్ప లక్ష్యాన్ని త్వరగా ఛేదించి సెమీస్ నాలుగో స్థానానికి ముందంజలో నిలిచింది.

శ్రీలంక నిర్దేశించిన 172 పరుగుల టార్గెట్ ను 23.2 ఓవర్లలో ఛేదించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర 42, డెవాన్ కాన్వే 45, డారిల్ మిచెల్ 43, విలియమ్సన్ 14 పరుగులు చేశారు.

టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకు ఆదిలోనే షాకుల మీద షాకులు తగిలాయి. శ్రీలంక బ్యాట‌ర్లు ఆశించినంత మేర‌కు స్కోర్ చేయ‌లేక‌పోయారు.

32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది శ్రీలంక‌. పాతుమ్ నిస్సాంక (2), కుషాల్ మెండిస్ (6), సమరవిక్రమ (1) నిరాశపర్చారు.

అయితే శ్రీలంక బ్యాట్స్ మెన్లు కుశ‌ల్ పెరీరా 51 ప‌రుగులు చేయ‌గా, ధ‌నుంజ‌య డిసిల్వ 19 ప‌రుగులు, ఏంజెలో మాథ్యూస్ 16 ప‌రుగులు, మ‌హేష్ థీక్ష‌ణ 39 ప‌రుగులు చేశారు.

పాక్, ఆఫ్ఘాన్ సెమీస్ ఆశ‌లు ఆవిరి

ఇక, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్ల సెమీస్ ఆశలు దాదాపు ఆవిరైపోయినట్టే కినిపిస్తోంది. ఈ రెండు జట్లు తమ చివరి మ్యాచుల్లో ఓడితే ఎటువంటి సమీకరణాలు అవసరం లేకుండానే న్యూజిలాండ్ సెమీఫైనల్లో అడుగుపెడుతుంది.

ఒకవేళ గెలిస్తే నెట్ రన్ రేటు కీలకమవుతుంది. ఇప్పటివరకు చూస్తే పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ కంటే కివీస్ కే మెరుగైన రన్ రేటు ఉంది.

శుక్రవారం జరిగే మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో అఫ్గానిస్థాన్ తలపడనుంది

శనివారం జరిగే మ్యాచ్ లో ఇంగ్లండ్,పాకిస్థాన్ తలపడనున్నాయి. మంచి రన్ రేటుతో గెలిస్తేనే పాకిస్థాన్ సెమీస్ రేసులో ఉంటుంది..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow