భారత జట్లు చరిత్ర సృష్టించింది

స్టూడియో భారత్ ప్రతినిధి

Mar 21, 2024 - 06:47
 0  9
భారత జట్లు చరిత్ర సృష్టించింది

భారత టేబుల్ టెన్నిస్ జట్లు చరిత్ర సృష్టించాయి. తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. గతంలో ఒలింపిక్స్‌కు పురుషుల, మహిళల సింగిల్స్ విభాగంలో ఆటగాళ్లు అర్హత సాధించినప్పటికీ, టీమ్ విభాగంలో జట్టుగా పోటీపడటం ఇదే తొలిసారి. ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా మన టేబుల్ టెన్నిస్ జట్లు మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగనున్నాయి. ఈ ఏడాది పారిస్‌లో ఒలింపిక్స్ జరగనున్న విషయం తెలిసిందే.

ఇటీవల దక్షిణ కొరియాలో ప్రపంచ టీమ్ ఛాంపియన్‌షిప్ జరింది. ఈ ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన ఎనిమిది జట్లు ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాయి.మిగిలిన ఒలింపిక్ బెర్తులకు ర్యాంకింగ్ ఆధారంగా అర్హత సాధించిన జట్లను సోమవారం ప్రకటించారు. టాప్-16 ర్యాంకింగ్స్‌లోపు ఉన్న జట్లను ఎంపిక చేశారు.దీంతో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరి ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకున్న మన జట్లు మెగా ఈవెంట్‌లో పోటీపడే ఛాన్స్ దక్కించుకుంది. ఉమెన్స్ టీమ్ 13వ ర్యాంక్, పరుషుల జట్టు 15వ ర్యాంక్‌కు చేరాయి. భారత్‌తో పాటు మహిళల ఈవెంట్‌లో పోలెండ్‌ (12), స్వీడన్‌ (15), థాయ్‌లాండ్‌; పురుషుల విభాగంలో క్రొయేషియా (12), భారత్‌ (15), స్లొవేనియా (11) పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి.

ప్రపంచ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల జట్టులో ఆకుల శ్రీజ, మనిక బత్రా, ఐహిక ముఖర్జీ, దియా, అర్చన్ కామత్ గొప్పగా పోరాడిన విషయం తెలిసిందే. అలాగే మెన్స్ టీమ్‌లో అచంట శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్, మానవ్ ఠక్కర్, హర్మీత్ దేశాయ్, మనుషా సత్తాచాటారు. కాగా, టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ శరత్ కమల్ అయిదోసారి ఒలింపిక్స్ ఆడనున్నాడు. గతంలో జట్టుగా కాకుండా వ్యక్తిగతంగా బరిలోకి దిగాడు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow