జగ్గయ్యపేట పట్టణానికి నీటి ఎద్దడి తప్పదా...

ఈ భాద్యతలు ఎవ్వరిదనే ప్రశ్న .. జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి....

Mar 20, 2024 - 09:30
 0  208
జగ్గయ్యపేట పట్టణానికి నీటి ఎద్దడి తప్పదా...

జగ్గయ్యపేట పట్టణానికి నీటి ఎద్దడి తప్పదా...

పూర్వం నుండే వెంటాడుతున్న నీటి ఎద్దడి...

ఈ భాద్యతలు ఎవ్వరిదనే ప్రశ్న 

జగ్గయ్యపేట

జగ్గయ్యపేట పట్టణానికి పాలేరు నుండి పూర్వకాలంలో చిన్న చిన్న సెలలు త్వవుకొని నీటిని కావడలతో నీటిని వాడుకునే వారు.దీనిని గమనించిన కీ.శే సామినేని విశ్వనాథం జగ్గయ్యపేట పట్టణానికి ఇంటింటికి నీటిని కుళాయి ద్వారా అందించాలనే కృత నిశ్చయంతో పట్టణంలో పైపు లైన్ లను ఏర్పాటు చేసి ప్రజల కష్టాలను తొలగించారు.

అది కొనసాగుతుండగానే నాయకత్వాలు ఎన్ని మారుతూ వచ్చిన ఎండాకాలం వచ్చే సరికి పాలేరు లో నీరు అందక అష్టకష్టాలు పడుతున్న ప్రజలు తరుపున వామపక్షాలు కృష్ణా వాటర్ ని పట్టణ ప్రజలకు త్రాగునీరుగా అందించాలనే నినాదాని ముందుకు తీసుకొని వచ్చారు.దీనితో పాటిబండ్ల వెంకట్రావు తన స్వంత నిధులను ఖర్చు పెట్టి కృష్ణా డ్రింకింగ్ వాటర్ ప్రక్రియను కార్యాచరణంతో ముందుకు రావడం జరిగిన పరిస్థితులు అనుకూలించకపోవడంతో సమస్య అదే విధంగా ఉంది.

గత ఎలక్షన్ ముందు అప్పటి యంయల్ఏ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) కృష్ణా వాటర్ ప్రాజెక్ట్ ప్రారంభించగా,అది కాస్తా పనులు పూర్తి స్థాయిలో కాకపోవడంతో ప్రజలకు అందుబాటులోకి రాలేదు.2019 ఎలక్షన్ పూర్తి అయి జగ్గయ్యపేట శాసనసభ్యులు గా ఎన్నుకోబడిన సామినేని ఉదయభాను వెంటనే కృష్ణా వాటర్ మిగిలిన పనులను పూర్తి చేసి,పట్టణ ప్రజలకు కళగా మిగిలిన కృష్ణా జలాల త్రాగునీరు సమస్యను పూర్తి అయి ప్రజలందరికి కృష్ణా వాటర్ అందుబాటులోకి రావడం జరిగింది.దీనితో సమస్య తీరుతుందిలే అనుకుంటున్న తరుణంలో జగ్గయ్యపేట పట్టణ ప్రజలకు పాత పైపులైన్లు పాడవడంతో మరమ్మతులతో నీటి సమస్య ప్రారంభం అయిందనే చెప్పుకోవచ్చు.

ఇది చాలదన్నట్లు కాలుష్యం,ప్రకృతి సంపదైన కొండలు,గుట్టలను సైతం యద్దేచ్చగా త్రవ్వకాలకు అనుమతులివ్వడం,ప్రకృతి ప్రకోపాల నడుమ మరియు ఎగువన సకాలంలో వానలు పడకపోవడం,ఎగువన ప్రాజెక్ట్ ల ఏర్పాట్లతో ముక్త్యాలలో కృష్ణా నదిలో వాటర్ లెవల్ తగ్గుముఖం పడటంతో కృష్ణానది సైతం పిల్లకాల్వ మాదిరిగా మారడంతో కృష్ణా నది పై ఏర్పాటు చేసిన బావులలోకి నీరు అందే పరిస్థితులే ప్రశ్నార్థకంగా మారబోతుందనే చెప్పుకోవచ్చు.

దీనితో జగ్గయ్యపేట పట్టణానికి మరలా నీటి కష్టాలు తప్పే పరిస్థితులు లేకపోలేదు.ప్రజలకు త్రాగునీరు నీరు అందించే దానిని సైతం రాజకీయం చేసే పరిస్థితులు లేకపోలేదు.రాజకీయ క్రీడలలో జగ్గయ్యపేట పట్టణానికి కాలుష్యం,సిమెంట్ కర్మాగారాలకు కావాల్సిన ముడి వనరులను ప్రభుత్వ అనుమతులతో యద్దేచ్చంగా త్రవ్వకాలతో ప్రకృతి గమనం మారుతుంది.దీనితో పర్యావరణంలో మనుషులకు సైతం నీరు అందే పరిస్థితులలో రాను రాను కాలంలో నీటి జాడలు సైతం ఎండిపోయి జీవనదులు సైతం నిర్జీవం అవ్వబోతుందనే చెప్పుకోవచ్చు.

కాబట్టి జగ్గయ్యపేట పట్టణ మరియు చుట్టుపక్కల ప్రజలు గమనించి కాలుష్యాని పారద్రోలుదాం,సహజ వనరులను కాపాడుకుందాం,సేవ్ వాటర్ సేవ్ ఎన్విరాల్మెంట్...మీ సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు...

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow