వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ..
స్పోర్ట్స్ స్టూడియో భారత్ ప్రతినిధి
మాక్స్‌వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్..
వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ..
మార్కరమ్ రికార్డు బ్రేక్..
వన్డే వరల్డ్ కప్-2023లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు.ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు.
డచ్ బౌలర్లను ఓ ఆటాడుకున్న మాక్సీ కేవలం 40 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు.
ఏకంగా 252.50 స్ట్రైక్ రేటుతో 101 పరుగులు సాధించి వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు.ఈ క్రమంలో సౌతాఫ్రికా వైస్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
What's Your Reaction?