ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి తెలంగాణ చీర
ఫ్రాన్స్ స్టూడియో భారత్ ప్రతినిధి

ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి.. తెలంగాణ చీర..
పారిస్:
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన ముగిసింది.ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు చందనపు చెక్కతో చేసిన సితార వాయిద్యాన్ని మోదీ కానుకగా అందజేశారు..
అలాగే మెక్రాన్ సతీమణికి తెలంగాణకు చెందిన పోచంపల్లి సిల్క్ ఇక్కత్ చీరను అందజేశారు.ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా మోదీకి పలు బహుమతులను మెక్రాన్ అందజేశారు.కాగా,శుక్రవారం పారిస్‌లో అట్టహాసంగా జరిగిన బాస్టీల్ డే పరేడ్ వేడుకలకు ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే..
What's Your Reaction?






