చెత్త డంపింగ్ యార్డ్ ను తరలించాలని సంతకాల సేకరణ
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

చెత్త డంపింగ్ యార్డ్ ను తరలించాలని సంతకాల సేకరణ- దోనెపూడి శంకర్
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట పట్టణం,ముక్త్యాల రోడ్డు,విలియంపేట సమీపంలో గల మున్సిపల్ డంపింగ్ యార్డ్ ను తరలించాలని కోరుతూ సిపిఐ పార్టీ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విలియంపేట ప్రజలు మరియు మహిళలు సంతకాలు పెట్టడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,యన్.టి.ఆర్ జిల్లా డిప్యూటీ కార్యదర్శి దోనెపూడి శంకర్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లకు గురౌతున్నారని,డంపింగ్ యార్డ్ లో చెత్తా చెదారాని తగలబెట్టటం మూలానా పొగ మబ్బు కమ్ముకొని వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని మున్సిపల్ తీరుని ఆయన విమర్శించారు.
దీనిని తరలించడానికి స్థానిక శాసనసభ్యులు మరియు మున్సిపల్ చైర్మన్ స్పందించకపోవడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు.ఇప్పటికే జగ్గయ్యపేట మున్సిపల్ 31 వార్డుల నుండి సుమారు 30 టన్నుల పైన చెత్తను సేకరించి,ఈ డంపింగ్ యార్డ్ లో మున్సిపల్ వారు పోస్తున్నారని ఆయన అన్నారు.మున్నిపల్ పాలక పక్షం తడి చెత్త మరియు పొడి చెత్తలను వేరు చేయకుండానే చెత్తను ఈ ప్రాంతంలో పోస్తున్నారని ఆయన అన్నారు.ఇప్పటికే ఇటువంటి చెత్త సేకరణ వల్ల పాలేరు నది కలుషితం అవుతుందని ఆయన అన్నారు.దీనితో ప్రజల ఆరోగ్య సమస్యలపై ప్రభావం పడుతుందని ఆయన అన్నారు.ప్రజలు కూడా డంపింగ్ యార్డ్ ని తరలించాలని ఆందోళన చేసారని ఆయన మున్సిపల్ వారికి గుర్తు చేశారు.
ప్రజల ఆరోగ్యాలు పాడౌతున్నాయి-పట్టించుకోండి
వెంటనే జగ్గయ్యపేట మున్సిపల్ వారు డంపింగ్ యార్డ్ ను ఈ ప్రాంతం నుండి తరలించాలని, లేని పక్షంలో డంపింగ్ యార్డ్ ను తరలించేంత వరకు ప్రజల పక్షాన సిపిఐ పార్టీ ఆందోళన చేస్తుందని ఈ సందర్భంగా ఆయన మున్సిపాలిటీని హెచ్చరించారు.ఈ సందర్భంగా జగ్గయ్యపేట సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణాని కాపాడుదామని మున్సిపల్ తెలియజేస్తూ,పాలేరు నదిని సైతం కలుషితం డంపింగ్ యార్డ్ వల్ల కలుషితం చేస్తూ, పాలేరు లో ఉన్న నీటి బావుల వల్ల పట్టణ ప్రజలకు అందుతున్న త్రాగునీరు కలుషితం అవ్వడంతో నీరు మురుకులుగాను,దుర్వాసన గాను కొన్ని ప్రాంతాలల్లో వస్తున్నాయని ఆయన ఆరోపించారు.ఇప్పటికైన మున్సిపల్ వారు తడి,పొడి చెత్తలను వేరు వేరుగా సేకరించాలని, ప్రజలకు అసౌకర్యంగా ఉన్న డంపింగ్ యార్డు ను ఊరి దూరంగా తరలించాలని కోరుతూ సంతకాల సేకరించి మున్సిపల్ అధికారులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.
సంతకాల సేకరణకి మద్దతుగా 14వ వార్డు నకిరికంటి వెంకట్,9 వ వార్డు కౌన్సిలర్ పేరం సైద్దేశ్వరావులు,10 వ వార్డు కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మీ,7 వ వార్డు కౌన్సిలర్ అలేఖ్య సైదా నాయుడు మరియు సోషల్ వర్కర్ జాన్ పాల్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు యన్.టి.ఆర్ జిల్లా సమితి సభ్యులు కెవి భాస్కరరావు, జగ్గయ్యపేట నియోజకవర్గ సహాయ కార్యదర్శి అంబోజి శివాజీ,భోగ్యం నాగులు,మెటికల శ్రీనివాసరావు,షేక్ జాని తదితరులు పాల్గొన్నారు
.
What's Your Reaction?






