డొనాల్డ్ ట్రంప్ గెలుపు వెనుక ఎలాన్ మస్క్
స్టూడియో భారత్ ప్రతినిధి
డొనాల్డ్ ట్రంప్ గెలుపు అమెరికా అధ్యక్షఎన్నికల్లో ఎలాన్ మస్క్ భారీగా కృషి చేశారని స్వయంగా డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.అయితే ఈ ఎన్నికల్లో మస్క్ భారీగా ఏకంగా రూ.2 వేల కోట్లు డబ్బులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే ముందు చెప్పినట్లుగానే అమెరికా కేబినెట్‌లో మస్క్‌కు ట్రంప్ కీలక పదవిని అప్పగించారు.ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు.ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంలో ట్విటర్,స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే పలు కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. తాజాగా డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం ఎలాన్ మస్క్ ఏకంగా రూ.2 వేల కోట్లు ఖర్చు చేసినట్లు ఫెడరల్ ఫైలింగ్ ఒక నివేదికను విడుదల చేసింది.
ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తరఫున పొలిటికల్ యాక్షన్ కమిటీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. అయితే ఈ కమిటీకి ఎలాన్ మస్క్.. 239 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.2వేల కోట్లను నగదు రూపంలో ఇచ్చినట్లు సమాచారం. మరికొంత డబ్బును కూడా వివిధ మార్గాల్లో ట్రంప్ ప్రచారానికి ఖర్చు చేశారు. ఇక ఎన్నికలకు కొన్నివారాల ముందు 25 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.200 కోట్ల విలువైన 3 చెక్కులను అందించారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రూత్ బాడర్ గిన్స్బర్గ్ పేరు మీద మరో 20 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.160 కోట్లు ఇచ్చారు. పలువురు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు కూడా 12 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.100 కోట్లు ఎలాన్ మస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంలో ఎలాన్ మస్క్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కేవలం విరాళాలు మాత్రమే కాకుండా ట్రంప్ విజయం కోసం ముమ్మరంగా ప్రచారాలు,వ్యక్తిగతంగా కూడా ఎన్నికల క్యాంపెయిన్‌లో ఎలాన్ మస్క్ పాలు పంచుకున్నారు. మరోవైపు.. ఓటర్లను ట్రంప్‌కు అనుకూలంగా మార్చేందుకు వాక్ స్వాతంత్ర్యం, తుపాకీ హక్కులపై తాము రూపొందించిన పిటిషన్‌పై సంతకాలు చేసిన ఓటర్లకు ఎలాన్ మస్క్ డబ్బులు పంచినట్లు వార్తలు వెలువడ్డాయి.ఇక తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాన్ మస్క్‌కు కేబినెట్‌లో చోటు ఇస్తానని గతంలోనే తేల్చి చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. దాన్ని నిజం చేసి చూపించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) బాధ్యతలను కూడా ఎలాన్ మస్క్‌కు అప్పగించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే ఈ డోజ్ ప్రాజెక్టు కీలక లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఈ డోజ్‌లో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి కూడా సభ్యుడిగా ఉన్నారు.
స్కూల్ బిల్డింగ్ లో సీక్రెట్ కెమెరాల కలకలం.. టీచర్లకు కామాంధుడి మేసేజ్‌లు - https://studiobharat.com/Secret-cameras-in-the-school-building
What's Your Reaction?