పోలాండ్ చేరుకున్న తొలి భారతీయ నాయకుడు మోదీనే..

పోలాండ్ స్టూడియో భారత్ ప్రతినిధి

Aug 21, 2024 - 23:36
 0  51
పోలాండ్ చేరుకున్న తొలి భారతీయ నాయకుడు మోదీనే..

పోలాండ్ చేరుకున్న ప్రధాని.. తొలి భారతీయ నాయకుడు మోదీనే..

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రెండు రోజుల పోలాండ్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు.కొద్దిసేపటిక్రితమే మోదీ పోలాండ్ చేరుకున్నారు.45 ఏళ్లలో సెంట్రల్ యూరప్ దేశాన్ని సందర్శించిన తొలి భారతీయ నాయకుడు ప్రధాని మోదీనే కావడం విశేషం.భారత్,పోలాండ్ దేశాల దౌత్య సంబంధాలు 70ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా పోలాండ్ కు చేరుకున్న మోదీకి రాజధాని వార్సాలో ఘన స్వాగతం పలికారు.

కాగా,మోదీ పోలాండ్ పర్యటనక రావడంతో అక్కడి ప్రవాస భారతీయలు ఆనందం వ్యక్తం చేశారు. మోదీ బస చేయబోయే హోటల్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.“మా ప్రధాని పోలాండ్‌కు రావడం మాకు సంతోషకరమైన విషయం.ఇది భారతదేశం-పోలాండ్ సంబంధాలను మెరుగుపరిచే ముఖ్యమైన పర్యటన.ఇది పోలాండ్ నుండి భారతదేశానికి పెట్టుబడులను తీసుకురావడానికి సహాయపడుతుంది”అని భారత సంతతి పౌరుడు రాజ్‌ పాల్ సబ్నానీ చెప్పారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow