పేటలో యస్.యస్.ఆర్ మెగా జ్యూయలరీ షోరూం ప్రారంభం 

జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Aug 19, 2024 - 14:16
 0  605
పేటలో యస్.యస్.ఆర్ మెగా జ్యూయలరీ షోరూం ప్రారంభం 

పేటలో యస్.యస్.ఆర్ మెగా జ్యూయలరీ షోరూం ప్రారంభం 

జగ్గయ్యపేట 

జగ్గయ్యపేట పట్టణంలో ముక్త్యాల రోడ్డు బంగారు కొట్టు సెంటర్ లో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు(యస్.యస్.ఆర్) మెగా జ్యూలరీ షోరూంకు స్థానిక శాసన సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య),యన్.టి.ఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,మాజీ మంత్రివర్యులు నెట్టెం రఘురాం లు ముఖ్య అతిథులకు ఆహ్వానం పలకడం జరిగింది.అనంతరం జ్యోతి ప్రజ్వలనతో ముఖ్య అతిథుల చేతులు మీదుగా యస్.యస్.ఆర్ మెగా జ్యూలరీ షోరూంను ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా సంస్థ యజమాని అయిన మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు మాట్లాడుతూ పట్టణ మరియు చుట్టుప్రక్కల ప్రజలకు మెగా మాల్స్ లో వస్తువులను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఉత్సాహం చూపిస్తున్నారని,ఇక వినియోగదారులు పెద్ద మాల్స్ వెళ్ళే పరిస్థితులు లేకుండానే జగ్గయ్యపేట పట్టణంలో యస్.యస్.ఆర్ మెగా జ్యూలరీ షోరూంను ప్రజలకు అందుబాటులో తీసుకొని రావడం జరిగిందని ఆయన అన్నారు.

యస్.యస్.ఆర్ మెగా జ్యూలరీ షోరూం నుండి జువెలర్స్,వెండి,బంగారం మరియు డైమండ్ జ్యూయలరీ లను ఐజిఐ నాణ్యత తో వినియోగదారులకు అందించడం జరుగుతుందని వారు అన్నారు.ఇదే కాకుండా మూడు శాతం తరుగుతో కేడియం బంగారు వస్తువులను అధునాతన మోడల్స్ తో కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని,ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ఆయన తెలియజేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow