కావాలనే కరోనాను చైనా మానవులకు ఎక్కించిందానేది
చైనా స్టూడియో భారత్ ప్రతినిధి
కావాలనే కరోనాను చైనా మానవులకు ఎక్కించిందానేది?.. అని కొత్త వాదన తెరపైకి
కరోనా మానవులకు సమాజానికి ఎందుకు సోకింది అనేది మూడేళ్లుగా ప్రశ్నగానే మిగిలింది.తాజాగా.. చైనా... వుహాన్ లోని...వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ఓ పరిశోధకుడు...
ఒక్క ఆశ్చర్యకరమైన విషయాన్ని తెరపైకి తెచ్చారు.కరోనా వైరస్‌ని చైనా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మానవులకు సోకేలా చూడటం జరిగిందని ఆరోపించారు.ఆ పరిశోధకుడి పేరు చావో షావో (Chao Shao).తన తోటివారు (colleagues)...కరోనా వైరస్‌కి సంబంధించిన నాలుగు రకాల స్ట్రెయిన్లను మనుషులకు ఎక్కించారనీ..ఏ స్ట్రెయిన్ బాగా వ్యాపిస్తుందో తెలుసుకోవడానికి అలా చేశారని ఓ ఇంటర్వ్యూలో వారు చెప్పారు.
వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్త అయిన చావో షావో...
జెన్నీఫర్ జెంగ్ సంస్థకి ఇచ్చిన 26 నిమిషాల ఒక్క సంస్థ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు.షాన్ చావో అనే మరో రీసెర్చర్‌కి తన పై అధికారి 4 రకాల కరోనా స్ట్రెయిన్లను ఇచ్చి..వాటిని పరిశోధించమని కోరినట్లు తెలిపారు.ఈ నాలుగు స్ట్రెయిన్లలో ఏది ఎక్కువ జాతులకు వేగంగా, తేలికగా వ్యాపించగలదు? అన్నది కనిపెట్టడమే దీని ఉద్దేశం అని వారు తెలిపారు. చావో షావో ప్రకారం.. చైనా కరోనాను జీవ రసాయన ఆయుధంగా భావించింది.
2019లో వుహాన్‌లో మిలిటరీ వరల్డ్ గేమ్స్ జరిగినప్పుడు తన సహచరులలో కొంతమంది కనిపించలేదన్న చావో షావో...గేమ్స్ ఆడేందుకు వచ్చే అథ్లెట్లకు,కరోనా సోకేలా చేసేందుకే వారిని అథ్లెట్లు ఉంటున్న హోటళ్లకు పంపారని తర్వాత తెలిసిందని ఇంటర్వ్యూలో చెప్పారు.
ఏప్రిల్ 2020 లో చావో షాన్‌ను ఉయిఘర్స్ ఉండే క్యాంపుల దగ్గరకు పంపారనీ..వైరస్‌ని మనుషుల మధ్య వ్యాప్తి చెందేలా చేసేందుకే.. ఇలా చేశారని చావో షావో ఆరోపించారు.
కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది చనిపోయారనే అంచనాలు వినిపిస్తున్నాయి.ఇప్పటికీ ఆ వైరస్ ఇంకా ప్రజలకు సోకుతూనే ఉంది.దాని వ్యాప్తి,పుట్టుకపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.మరి చావో షావో చెప్పింది ఎంతవరకు నిజం అన్నది ప్రశ్న!నిజాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.
What's Your Reaction?