అమెరికాలో తుఫాన్ బీభత్సం.. నలుగురు మృతి
అమెరికా స్టూడియో భారత్ ప్రతినిధి

అమెరికాలోని నాలుగో అతిపెద్ద నగరమైన హ్యూస్టన్ గురువారం పెను తుఫానుతో వణికిపోయింది. ఈ తుఫాన్ కారణంగా నలుగురు మృతి చెందగా..8 లక్షల గృహాలు మరియు వాణిజ్య సంస్థలు అంధకారంలో చిక్కుకున్నాయి.వేలాది భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి.వరద నీటితో పలు వీధులు జలమయమయ్యాయి.కార్లు,ఇతర వాహనాలు నీట మునిగాయి.ముందుజాగ్రత్త చర్యగా అన్ని పాఠశాలలను మూసివేశారు. రెండు విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
What's Your Reaction?






