వరుస ఓటముల నుంచి అనూహ్య విజయాలు
స్టూడియో భారత్ ప్రతినిధి

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. సీఎస్కేకి 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆర్సీబీ బ్యాటర్లలో డుప్లెసిస్ 54 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 47, రజత్ పాటీదార్ 41, కామెరాన్ గ్రీన్ 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కేకి ఆదిలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ అయ్యాడు. రచిన్ 61 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఆఖర్లో ధోనీ పోరాడినా చెన్నై జట్టు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.చెన్నై జట్టు ఈ మ్యాచ్‌లో గెలవకపోయినా కనీసం 201 పరుగులు చేసినా సరే, నెట్ రన్‌రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి ఉండేది. కానీ 20 ఓవర్లలో 191 పరుగులతో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ, సీఎస్కే చెరో 14 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ, నెట్ రన్‌రేట్ కారణంగా సీఎస్కేను పక్కకు నెట్టేసి ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరింది.ఐపీఎల్ టీ20 సిరీస్ ప్రారంభమైన 2008 నుంచి గత 16 సీజన్లుగా ఆర్సీబీ చాంపియన్‌గా నిలవాలని అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు.
అయితే, వారికి ప్రతిసారీ నిరాశే ఎదురైంది.బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా ట్రోఫీని దక్కించుకోలేకపోయింది. ఎప్పటిలాగే 2024 ఐపీఎల్ టీ20 సీజన్‌లోనూ ఆర్సీబీ జట్టుపై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే, వేలంలో ఆ జట్టు చాలా మంది యువ విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయడంతో ఆర్సీబీ ఈసారి ఏదో మ్యాజిక్ చేస్తుందని భావించారు.అల్సారీ జోసెఫ్, ట్యాప్లీ, కామెరాన్ గ్రీన్, ఫెర్గూసన్, టామ్ కుర్రాన్ లాంటి ఎందరో ఆటగాళ్లు జట్టులోకి రావడంతో ఈసారి ఆర్సీబీ జట్టు భారీ విజయాలు సాధిస్తుందని అభిమానులు భావించారు. కానీ, ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన తర్వాత నెల రోజుల పాటు ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికే పరిమితమైంది. ఓటములతో విసుగు.. ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో సీఎస్కే చేతిలో ఆర్సీబీ ఓడిపోయింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌ను ఓడించడంతో ఆర్సీబీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చిందని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కానీ, ఆ తర్వాత వరుసగా 6 పరాజయాలు అభిమానులను తీవ్ర ఆగ్రహానికి, నిరాశకు గురిచేశాయి.మూడు వారాల కిందటి వరకు కూడా 8 మ్యాచ్‌లలో 7 ఓడిపోయి ఆర్సీబీ సిరీస్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితుల్లో ఉంది. దీంతో అభిమానుల నుంచి సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
వేలంలో ఆర్సీబీ ఫర్వాలేదనిపించినా, తుది జట్టుకు పదకొండు మంది ఆటగాళ్ల ఎంపిక బాలేదు, బౌలింగ్ బాలేదు, ఆల్ రౌండర్లు లేరు, మంచి స్పిన్నర్లు లేరంటూ సోషల్ మీడియాలో, టీవీ చానళ్లలో అభిమానులు, విమర్శకులు ఎన్నో విమర్శలు చేశారు. మార్పు.. ఆరు వరుస పరాజయాలతో ఆ జట్టు నిరాశలో కూరుకుపోయింది.ఆర్సీబీ తన ఎలెవెన్ స్క్వాడ్‌లో ఎలాంటి మార్పులు చేయకుండానే కొనసాగించింది, ఆల్ రౌండర్ మ్యాక్స్‌వెల్, డెత్ ఓవర్ బౌలర్ సిరాజ్ ఉన్నప్పటికీ ఆ జట్టు ఓటముల నుంచి గట్టెక్కలేకపోయింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో గత 15 ఏళ్లలో ఒక్కసారి కూడా చెన్నై జట్టుపై నెగ్గలేక ఆర్సీబీ డీలా పడిపోయింది. మరీముఖ్యంగా, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో 222 పరుగులు చేజింగ్ చేస్తూ కేవలం ఒక్క పరుగుతో ఓడిపోవడం ఆర్సీబీ ఆటగాళ్లను మరింత కుంగదీసింది. అయితే, ఆ పరాజయంతో ఇక చాలు అన్నట్లుగా తర్వాతి మ్యాచ్‌ల ఫలితాలు అనూహ్యంగా మారిపోయాయి. విజయాలు ఏప్రిల్ 25 తర్వాత ఆర్సీబీ పూర్తిగా మారిపోయింది.వరుసగా 6 విజయాలు సాధించి అభిమానుల్లో ఉత్సాహం నింపింది.
పాయింట్ల పట్టికలో చివరి స్థానం నుంచి 5 - 6 స్థానాలకు ఎగబాకింది.తొలిరౌండ్ లో ఓడించిన జట్లపై బెంగళూరు జట్టు ప్రతీకారం తీర్చుకుంది.ఉదాహరణకు, ఏప్రిల్ 15న బెంగళూరులో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 287 పరుగులు చేసి ఆర్సీబీకి కంటతడి పెట్టించింది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 262 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఆ తర్వాతి పది రోజుల్లోనే అంతా తల్లకిందులైంది. హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో 207 పరుగుల లక్ష్యంతో చేజింగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ జట్టును 171 పరుగులకే ఆలౌట్ చేసి ఆర్సీబీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.వరుస ఓటములను చవిచూసిన ఆర్సీబీ తిరిగి పుంజుకుని వరుసగా 6 మ్యాచ్‌లలో విజయం సాధించింది.ఇదెలా సాధ్యమైంది? వరుసగా 6 విజయాలు ఎలా? బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులొచ్చాయి? నిలకడగా, సమష్టిగా ఎలా రాణించారనే విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
What's Your Reaction?






