కెసిపి లో ప్రావిడెంట్ ఫండ్ (పియఫ్) పై అవగాహనా సదస్సు
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

కెసిపి లో ప్రావిడెంట్ ఫండ్ (పియఫ్) పై అవగాహనా సదస్సు
జగ్గయ్యపేట:
ఎన్ టి ఆర్ జిల్లా లో నిధి ఆప్కే నికట్ లో భాగంగా విజయవాడ పిఎఫ్ ఆఫీస్ అధికారులు స్థానిక కె సి పీ సిమెంట్సు,ముక్త్యాల,జగ్గయ్యపేట వారి సౌజన్యంతో మరియు ప్లాంట్ హెడ్ వి మధుసూదన రావు ఆధ్వర్యం లో సంస్థ నందు 'మీ సమీపంలో భవిష్యనిధి' పేరుతో ప్రావిడెంట్ సభ్యులు,పెన్షనర్స్ మరియు యజమాన్య ప్రతినిధులకు అవగాహన మరియు సమస్యల పరిష్కారం కొరకు సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా శేఖర్ శర్మ,ఎన్ఫోర్స్ మెంట్ ఆఫీసర్,ప్రావిడెంట్ ఫండ్ ద్వారా కలిగే ప్రయోజనాలను సవివరంగా తెలియచేసారు.
ఈపిఎఫ్ సేవలన్నీ ఆన్లైన్ ద్వారా పొందవచ్చని తెలియజేస్తూ,ఏఏ సేవలు ఆన్లైన్ ద్వారా పొందవచ్చు,ఏ విధంగా ఆన్ లైన్ లో ప్రావిడెంట్ మొత్తాలను చూసుకొనవచ్చునో అన్న విషయాలను విశదీకరించారు.అలాగే సమావేశానికి హాజరైన సభ్యుల సందేహాలను నివృత్తి చేసారు.ముఖ్యంగా వారి పాత సర్వీసు ప్రస్తుత సర్వీసులో కంటిన్యూ అయ్యే విషయంలోను,పియఫ్ ఉండగా చనిపోతే ఏ విధంగా కవరేజ్ చేసుకోవాలో సభ్యుల సందేహాలను నివృత్తి చేసారు.ఈ కార్యక్రమంలో ప్లాంట్ హెడ్ వి మధుసూదనరావు,వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్,హెచ్ ఆర్ హెడ్ శ్రీనుబాబు,హెచ్ ఆర్ మేనేజర్ మరియు పిఎఫ్ ఆఫీస్ సిబ్బంది శేఖర్ శర్మ,హరినాధ్,శ్రీనివాసరావు లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
What's Your Reaction?






