ఐసిడిఎస్ పరిధిలో బాల్య వివాహాల పై అవేర్నెస్ సమావేశం

చిల్లకల్లు స్టూడియో భారత్ ప్రతినిధి

Nov 20, 2023 - 17:48
Nov 20, 2023 - 18:16
 0  102
ఐసిడిఎస్ పరిధిలో బాల్య వివాహాల పై అవేర్నెస్ సమావేశం

ఐసిడిఎస్ పరిధిలో బాల్య వివాహాల పై అవేర్నెస్ సమావేశం

చిల్లకల్లు

యన్.టి.ఆర్ జిల్లా,జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు,యన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్,ఐసిడిఎస్ యన్.టి.ఆర్ జిల్లా ప్రాజెక్టు అధికారి(పిడి) వారి ఆదేశాల మేరకు బాల్య వివాహాలు,పిల్లల దత్తత,డ్రక్స్ నివారణ పై అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి లక్ష్మీ భార్గవి మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణ పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది.ఇప్పటికే చిల్లకల్లు ప్రాజెక్టు పరిధిలో మార్చి 2023 నుండి నేటి వరకు సుమారు 11 బాల్య వివాహాలను అడ్డుకొని,వారి పేరెంట్స్ కి బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల పై అవగాహన కల్పించటం జరిగిందని ఆమె తెలియజేశారు.

బాల్య వివాహాలను నివారించడానికి 1098 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయవచ్చు.మండల తహశీల్దార్,యంపిడిఓ,ఐసిడిఎస్ ప్రాజెక్టు, పోలీస్ వారికి,స్థానిక సర్పంచ్ లకు,యంయస్కేలు,అంగన్ వాడీ కేంద్రాలలో సమాచారాన్ని తెలియజేయవచ్చునని ఆమె తెలియజేశారు.అనంతరం చిల్లకల్లు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఏసిడిపిఓ నాగమణి మాట్లాడుతూ పిల్లలు లేని వారికి స్త్రీ శిశు సంరక్షణ కేంద్రం లో చట్టబద్ధతతో పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే వారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె తెలియజేశారు.డ్రగ్స్ ప్రభావం వల్ల యువత పక్క దారి పడుతుందని, డ్రక్స్ నివారణ కోసం తెలిసిన సమాచారాన్ని పోలీస్ వారికి తెలియజేయగలరని వచ్చిన వక్తలు మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో యంపిడిఓ రమేష్,ఐసిపియస్ నుండి ప్రభాకరరావు,మెప్మా నుండి యన్ వెంకటేశ్వరావు,పోలీస్ శాఖ నుంచి సిహెచ్ సత్యనారాయణ మరియు అంగనత వాడీ సూపర్ వేజర్స్,అంగన్వాడీ టీచర్లు ఆయాలు,యంయస్కేలు తదితరులు పాల్గొన్నారు.

https://youtu.be/fktakI9xdd8?si=zmBRgYbSXS0t3cRZ

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow