ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసిన నిధి
స్టూడియో భారత్ ప్రతినిధి
ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసిన నిధి?
టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.అయితే, స్టార్ హీరోయిన్ స్థాయిని మాత్రం అందుకోలేకపోయింది.తమిళంలో కూడా వరుసగా పలు సినిమాలు చేసినప్పటికీ...హీరో శింబుతో లవ్ అఫైర్ అంటూ వచ్చిన వార్తలు ఆమె కెరీర్ పై ప్రభావం చూపాయి.
తాజాగా నిధి గురించి ఒక వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్,దర్శకుడు మారుతి కాంబినేషన్లో పీరియాడిక్ హారర్ కామెడీ మూవీలో నిధిని తీసుకున్నట్టు చెపుతున్నారు.హీరోయిన్ గా ఆమె దాదాపు ఖరారు అయినట్టేనని సమాచారం.ఇదే నిజమైతే నిధి అగర్వాల్ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే.
What's Your Reaction?