ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే
స్టూడియో భారత్ ప్రతినిధి
ఈ లెక్కలు ఆగేలా లేవుగా.. 9 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
'భగవంత్ కేసరి', 'లియో', 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలు.. రీసెంట్గా దసరా బరిలో నిలిచి మంచి రెస్పాన్స్ను అందుకున్నాయి. అయితే వీటిలో 'భగవంత్ కేసరి' బాక్సాఫీస్ విన్నర్గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లతో దూసుకెళ్తోంది. దసరా పండగా పూర్తైనా కూడా నాన్ వీకెండ్లోనూ మంచిగానే పైసా వసూలు చేస్తోంది. ఆరు రోజుల్లో రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం తొమ్మిది రోజులు పూర్తయ్యేసరికి మరిన్ని కలెక్షన్లను ఖాతాలో వేసుకుంది.
ఈ లెక్కన...
ఈ వారం పూర్తయ్యేలోగా లాభాలు కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేసున్నాయి. ఈ వీకెండ్లో బాగా పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇప్పటికే 85 శాతం కన్నా ఎక్కువ మొత్తాన్ని రికవరీ చేసిందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తొమ్మిది రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో వివరాలు బయటకు వచ్చాయి.తొమ్మిది రోజుల్లో.. నైజాంలో రూ. 15.22 కోట్లు, సీడెడ్‌లో రూ. 12.06కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.17 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.79 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.2.44 కోట్లు, గుంటూరులో రూ. 5.36 కోట్లు లక్షలు, కృష్ణాలో రూ. 3.01కోట్లు, నెల్లూరులో రూ.2.07 కోట్లు వచ్చాయని తెలిసింది. ఇక కర్ణాకట, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి రూ. 4.77 కోట్లు, ఓవర్సీస్ రూ.7.17కోట్లు వసూలు చేసిందని సమాచారం అందింది.
మొత్తంగా తొమ్మిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 60.06కోట్లు షేర్, 119.51 గ్రాస్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నాయి.
What's Your Reaction?