పోలీసులు సివిల్ కేసులలో జోక్యం చేసుకునే అధికారం ఎంతవరకు ఉంటుంది

స్టూడియో భారత్ ప్రతినిధి

Nov 21, 2023 - 12:19
 0  39
పోలీసులు సివిల్ కేసులలో జోక్యం చేసుకునే అధికారం ఎంతవరకు ఉంటుంది

పోలీసులు సివిల్ కేసులలో జోక్యం చేసుకునే అధికారం ఎంతవరకు ఉంటుంది

సివిల్ కేసులయినటువంటి వ్యక్తిగత ఆస్తులు, వారసత్వ ఆస్తుల పంపకాలు, వారసత్వ గొడవలు ఇంటి అద్దెల వ్యవహారాలు, వ్యక్తుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యవహారాలు, వివాహ సంబంధ వ్యవహారాలు,విడాకులు, దాంపత్య హక్కులు,ప్రాంసరీ నోటులు, ప్రోనోటు హక్కులు, వ్యక్తిగత జీవితాల్లోకి జోక్యం చేసుకునే అంశాల్ని సివిల్ వివాదాలుగా పరిగణించబడతాయి. కొన్ని సందర్భాలలో వ్యక్తిగత జీవితాల్లోకి జోక్యం, అందులో మహిళల జీవితాలలో ప్రవేశించి ఇబ్బంది పెట్టి అంశాలన్నీ కూడా క్రిమినల్ వివాదాలుగా పరిగణించబడతాయి.

●సివిల్ వివాదాలలో పోలీసులు జోక్యం చేసుకోరాదని వారికి పై విధంగా పేర్కొన్న వ్యవహారాలలో జోక్యం చేసుకునేందుకు ఎటువంటి అధికారం, ఎటువంటి చట్టం కానీ రాష్ట్ర లేదా ఆ దేశ కోర్టు తన తీర్పు ద్వారా నేటి వరకు కూడా పోలీసులకు అధికారాలు ఆపాదించ లేదు. 

●అలాంటి అధికారాలు ఇవ్వమని సివిల్ తగాదాలలో గొడవ జరిగి రక్త గాయాలు అయితే అది నేరం అవుతుంది. అలాంటి నేరం జరిగిందని బాధితులు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు 

●పౌరులలో ఎవరైనా పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చు ఆ సమాచారం పై పోలీసులు విచారణ చేసి నిజానిజాలు తెలుసుకొని శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవచ్చు. 

●పోలీసులు సివిల్ తగాదాలలో తమ ఇష్టారీతిగా జోక్యం చేసుకోరాదని పలు కేసులలో తమ రాష్ట్ర హైకోర్టు మరియు సుప్రీం కోర్టు తన తీర్పులలో ప్రభుత్వాలను ఆదేశించింది. అందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సివిల్ కేసులలో పోలీసులు జోక్యం చేసుకోకూడదని ప్రభుత్వాలు తమ ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నాయి.

●కానీ నేటి పోలీస్ వ్యవస్థ వ్యవహారాలు చూస్తుంటే గ్రామీణ ప్రాంతాలు మరియు అటవీ ప్రాంత ప్రజలపై ఆధిపత్యం చెలాయించడానికి, ప్రజలను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి పోలీసులు సివిల్ తగాదాలలో క్రిమినల్ తగాదాల కంటే ఎక్కువ జోక్యం చేసుకొని రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తూ వివాదాలను పరిష్కరించడానికి అనధికారికముగా వెనుకాడడం లేదు. 

●నేటి ప్రభుత్వాలు కూడా వీటి గురించి చోద్యం చూస్తూ పోలీసులను తమకు అనుకూలంగా మలచుకుంటూ తమ రాజకీయ ఆధిపత్యం కోసం పోలీసులను పావులుగా వాడుకుంటూ ప్రజలపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఉసిగొలుపుతున్నారు. 

●పోలీసులు కూడా రాజకీయ నాయకుల అండతో అదే అదనుగా కొన్ని కొన్ని సందర్భాలలో తమను ప్రశ్నించే వారిని తమ లాఠీలను ఝుళిపిస్తూ కక్ష సాధిస్తున్నారు. నామ్కే వాస్తే తీర్పులు చెబుతూ పోలీసులకు వంత పాడుతూనే ఉన్నారు. 

●న్యాయాన్యాయాల గురించి లోతుగా పరిశీలించడం లేదు. వివాదాస్పద సాక్ష్యాధారాల పరిశీలన ఆధారంగా తీర్పులు చెబుతున్నారు తప్ప,వేరే విధంగా న్యాయ బాధితులకు న్యాయం పూర్తిగా అందడం లేదన్నది నేటి సమాజ పోకడ.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow