అంగన్వాడీ కేంద్రాలకు అద్దె డబ్బులు కోసం ఎదురు చూపులు 

విజయవాడ స్టూడియో భారత్ ప్రతినిధి

Nov 21, 2023 - 18:11
 0  89
అంగన్వాడీ కేంద్రాలకు అద్దె డబ్బులు కోసం ఎదురు చూపులు 

అంగన్వాడీ కేంద్రాలకు అద్దె డబ్బులు కోసం ఎదురు చూపులు 

విజయవాడ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో గల ఒక్కొక్క జిల్లాకి సుమారు 9 నుండి 13 అంగన్వాడీ ప్రాజెక్టులున్నట్లుగా తెలుస్తోంది.ఒక్కొక్క ప్రాజెక్ట్ పరిధిలో సుమారు 2000 ల నుండి 3000 ల లోపు అంగన్వాడీ కేంద్రాల నుంచి గర్భిణీలకు,బాలింతలకు,0-5 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రభుత్వం నుంచి పౌష్టికాహారం అందించడంతో రక్త హీనత బారినపడకుండా ప్రభుత్వం కాపాడుతుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలు సుమారు 45 నుండి 60 శాతం మేర అద్దె భవనాలలో కొనసాగుతున్నట్లు సమాచారం.

ఒక్కొక్క అంగన్వాడీ అద్దె కేంద్రానికి సుమారు 2000 రూ నుండి 4000 రూ ల లోపు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను చెల్లిస్తుంది.నెలకి సుమారు జిల్లా కేంద్రంలో గల ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ కోసం అద్దె భవనాలకు ప్రభుత్వం సుమారు 15 నుండి 20 లక్షల రూపాయలను అద్దె డబ్బులను చెల్లిస్తున్నట్లు వినికిడి.ప్రస్తుతం సుమారు నాలుగు ఐదు నెలల నుండి అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం అద్దె బడ్జెట్ విడుదల చేయకపోవడంతో అంగన్వాడీ కేంద్రాలకు అద్దెకు ఇచ్చిన భవన యజమానులు అద్దె డబ్బుల కోసం ఇన్ని నెలలు ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో అద్దె భవనాలల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఖాళీ చేయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

దీనితో పాటు 2017 సంవత్సరం నుండి టిఏ ల డబ్బులు ఊసే లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల అద్దె భవనాలకు పెండింగ్ అమ్మౌంట్ ను మరియు పెండింగ్ టిఏ డబ్బులను విడుదల చేసి అంగన్వాడీలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని పలువురు కోరుతున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow