వైభవంగా విజ్ఞాన్ హై స్కూల్ కాకాని నగర్ బ్రాంచ్ మినీ వార్షికోత్సవ వేడుకలు
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

వైభవంగా విజ్ఞాన్ హై స్కూల్ కాకాని నగర్ బ్రాంచ్ మినీ వార్షికోత్సవ వేడుకలు
జగ్గయ్యపేట
ది.25/02/2025 మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు VIGNAN VAIBHAV ప్రోగ్రాం అత్యంత ఉత్సాహ భరిత వాతావరణంలో జరిగింది.ఉదయం నుండి సాయంత్రం వరకు సుమారు 70 కు పైగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రకృతి ని ఎలా కాపాడుకోవాలి,సెల్ ఫోన్ అవసరమైనంత వరకే వినియోగించాలి.
మన దేశంలో రైతు మరియు జవాన్ యొక్క విలువలను తెలియజేసే వివిధ రకాల స్కిట్ లు కార్యక్రమానికి హాజరైన సుమారు 1000 మంది తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.సంవత్సరం మొత్తం అకడమిక్ సిలబస్ తో వత్తిడితో ఉన్న విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలిగించే ఉద్దేశ్యంతో VIGNAN VAIBHAV ప్రోగ్రాం ను రూపొందించటం జరిగిందని స్కూల్ డైరెక్టర్ శ్రీమతి తన్నీరు సుధారాణి పేర్కొన్నారు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఈ కార్యక్రమం రూపొందించటం జరిగందని తెలిపారు.
తల్లిదండ్రుల కోరికలకు, ఆశలకు అనుగుణంగా విద్యార్థుల భవితకు అవసరమగు చదువుతో పాటు NCC, IIT, లలో శిక్షణ వంటి ఎన్నో హంగులను తమ విజ్ఞాన్ విద్యాసంస్థ కలిగి ఉందని, పట్టణంలో వివిధ శాఖలు వారు నిర్వహించిన పలు పలు రకాల పోటీలలో తమ విద్యార్థులు బహుమతులు గెలిచి గుర్తింపు కలిగిన ప్రతిభను కనపరుస్తారని ఈ సందర్బంగా ఆమె తెలిపారు. ఈ సందర్బంగా ఇటీవల నిర్వహించిన SPORTS MEET విజేతలకు బహుమతులు అందజేశారు.
What's Your Reaction?






