ఆర్.టి.సి బస్టాండ్ లో రోడ్డు భద్రతా వారోత్సవాల పై అవగాహన - యంవిఐ యంవియన్ రాజు

జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Jan 17, 2025 - 14:45
 0  53
ఆర్.టి.సి బస్టాండ్ లో రోడ్డు భద్రతా వారోత్సవాల పై అవగాహన - యంవిఐ యంవియన్ రాజు

ఆర్.టి.సి బస్టాండ్ లో రోడ్డు భద్రతా వారోత్సవాల పై అవగాహన - యంవిఐ యంవియన్ రాజు

జగ్గయ్యపేట 

జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో గల ఆర్.టి.సి బస్టాండ్ లో గ్రామీణ ప్రయాణీకులకు రోడ్డు భద్రత పట్ల మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ యంవియన్ రాజు గారు అవగాహన కల్పించారు.అటుగా హెల్మెట్ లేకుండా బైక్ పై వెళ్ళుతున్న వాహనదారుని ఆపి హెల్మెట్ ని అందించి,సురక్షిత ప్రయాణం కోసం,ఆనందకరమైన జీవితం కోసం తప్పక పాటించాలని ఆయన అన్నారు.

కారు నడిపే వారు తప్పని సరిగా సీటు బెల్టు పెట్టుకోవాలని,మద్యం త్రాగి వాహనం నడపకూడదని,చిన్న పిల్లలకు వాహనాలను నడపటానికి ఇవ్వదని,ఆటోలో ఒవర్ లోడ్ ప్రయాణం మంచిది కాదని ఆయన అన్నారు.సురక్షిత ప్రయాణం కోసం ప్రతి ఒక్క వాహనదారులు వాహనాల పేపర్స్,తప్పని సరిగా నడిపే వాహనానికి ఇన్సురెన్స్ మరియు పొల్యూషన్ ఫోర్స్ లోను ఉంచుకోవాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో యంవిఐ కార్యాలయం సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ షేక్ ఆలాం,షరత్ చంద్ర, జగ్గయ్యపేట పట్టణ ట్రాఫిక్ పోలీసులు సిహెచ్ భూపతిరావు,జీవన్,ప్రజలు,ప్రయాణీలు,సోషల్ వాలంటరీలు పి ప్రభు,వి సురేష్,ఆర్ అప్పారావు,యు రమేష్,యస్.కె బాబు,యన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow