సుప్రీం కోర్టులో కొత్త న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
డిల్లీ స్టూడియో భారత్ ప్రతినిధి
సుప్రీం కోర్టులో ఇద్దరు కొత్త న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం..
దిల్లీ:
సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్,జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్ నేడు బాధ్యతలు చేపట్టారు.ఇద్దరు కొత్త న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేయించారు.
2011లో గువాహటి హైకోర్టులో భూయాన్ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు.అనంతరం ఆయన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.ఆ తర్వాత 2022 జూన్ 28 నుంచి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు.తాజాగా సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.ట్యాక్సేషన్ లాలో ప్రత్యేక నైపుణ్యం పొందారు.ఆయన బాంబే హైకోర్టు న్యాయమూర్తిగానూ సేవలందించి ట్యాక్సేషన్‌తో పాటు విభిన్న రంగాలకు సంబంధించిన కేసులను విచారించారు.ఆయన తీర్పుల్లో చట్టం,న్యాయానికి సంబంధించి విస్తృత కోణాలను స్పృశించారు.
మరోవైపు జస్టిస్ వెంకట నారాయణ భట్ 2013లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తొలిసారి న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.అనంతరం 2019లో ఆయన్ను కేరళ హైకోర్టుకు బదిలీ చేశారు.అక్కడ ఆయన 2023 జూన్ నుంచి ప్రధాన న్యాయమూర్తిగా అదే కోర్టులో బాధ్యతలను స్వీకరించారు.వీరిద్దరి రాకతో సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32 నుంచి 34కు చేరింది..
What's Your Reaction?