భూమి ఉష్ణోగ్రత 50 - 55 డిగ్రీలకి చేరబోతుందా !
మనుషులు మిగిలే పరిస్థితి లేదా ..... స్టూడియో భారత్ ప్రతినిధి

*2030 - 2040 కల్లా ఈ భూమి ఉష్ణోగ్రత 50 - 55 డిగ్రీలకి చేరబోతుందా మనుషులు మిగిలే పరిస్థితి లేదా .. !
పీల్చుకోడానికి స్వచ్ఛమైన గాలి లేదు...
కొనుక్కుని తాగితే తప్ప తాగగలిగే నీరు మిగలలేదు..
అయితే అతి వర్షాలు, లేకపోతే వర్షాభావ పరిస్థితులు..
భగభగ మండే ఎండలో నిలబడడానికి, నీడనిచ్చే చెట్టు మిగలలేదు..
తినే తిండి మొత్తం పురుగుల మందుల మయం..
భూమి మీద ప్లాస్టిక్ పొరలు పొరలు పెరుకుపోతున్నాయి..
నదులు మొత్తం మురుగు కాల్వలుగా మారుతున్నాయి..
సముద్రాలు అన్నీ మృత్యు కుహూరాలుగా మారుతున్నాయి..
కొత్త కొత్త జబ్బులు,క్యాన్సర్లు,వైరస్లు...
ఇంకో పది సంవత్సరాల్లో ఈ దేశమే కాదు,, ధ్రువ ప్రాంతాల్లో మంచుకొండలు కరిగి ఈ భూమ్మీద 40% నాగరికత అంతరించబోతుంది..తుఫానులు,భూకంపాలు,పేదరికం,అంటురోగాలు ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేయబోతున్నాయి..
మన బిడ్డలు,వాళ్ళ బిడ్డలు,హాయిగా సుఖంగా బ్రతకాలంటే,,కావలసింది,కాదు..వ్యర్ధాలు లేని భూమి కావాలి...స్వచ్ఛమైన గాలి కావాలి...కలుషితాలు లేని నీరు కావాలి...
మీ తరువాతి తరాల మనసుల్లో విద్వేషపు విష బీజాలు నాటడం మాని...అందరూ కలిసి కనీసం తలోక చిన్న మొక్క నాటండి...
ఆలోచించండి...
దేశాలను ప్రజలను వారి ఆరోగ్యాలను తద్వారా మానవజాతిని కాపాడుకుందాం ... మరింత అప్ డేట్స్ తెలుగు న్యూస్ కోసం చదవండి....www.studiobharat.com
What's Your Reaction?






