బస్టాప్ ఎత్తు కెళ్లారు
బెంగళూరు స్టూడియో భారత్ ప్రతినిధి
బెంగళూరు
బస్టాపుల్లో జేబు దొంగలు, చైన్ స్నాచర్లను చూశాం.పిల్లల్ని ఎత్తుకెళ్లే దొంగల ముఠాలు కూడా కాపాకాచి ఉంటాయి.కానీ వీడెవడో ఏకంగా బస్ స్టాప్ కే ఎసరు పెట్టాడు.అసక్కడ బస్టాప్ ఉండేదా?అనే సందేహం కలిగేలా కనీసం అనవాళ్లు కూడా లేకుండా సాంతం ఎత్తుకెళ్లాడు.ఈ విచిత్ర ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
బెంగళూరులోని కన్నింగ్‌హామ్ రోడ్డు వాహనాల రాకపోకలతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది.అక్కడ బెంగళూరు మెట్రోపోలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BNTC) కొత్తగా బస్టాప్ ను నిర్మించింది.దాదాపు రూ.10 లక్షల విలువైన సామాగ్రితో స్టెయిన్ లెస్-స్టీల్ తో అధునాతన వసతులతో దీనిని నిర్మించిన బస్టాప్ ను దొంగలు ఎత్తుకెళ్లారు.
What's Your Reaction?