సిరియాలోని అలెప్పో లో చాలా ప్రాంతాలు ఈ రెబల్స్ స్వాధీనం చేసుకున్నధి ఎవరు?
స్టూడియో భారత్ ప్రతినిధి
సిరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు దళాలు బుధవారం భారీ దాడులు ప్రారంభించాయి. శనివారం నాటికి దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన అలెప్పోలోని చాలాప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఈ అనూహ్య దాడి.. 2016 తర్వాత అలెప్పోపై మొదటిసారి జరిగిన రష్యన్ దాడులను తలపించింది, సిరియా సైన్యం తన దళాలను నగరం నుంచి ఉపసంహరించుకునేలా చేసింది.ఈ దాడులకు సిరియా సంక్షోభంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ ''హయత్ తహ్రీర్ అల్ - షామ్'' (హెచ్‌టీఎస్) నాయకత్వం వహించింది.
అసలు ఎవరీ హయత్ తహ్రీర్ అల్ - షామ్ రెబల్స్?
అల్ ఖైదాకు అనుబంధంగా 2011లో ఏర్పాటైన జభత్ అల్ -నుస్రా తర్వాతి కాలంలో హెచ్‌టీఎస్‌గా మారింది.దీని ఏర్పాటు వెనక తమకు తాము ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)గా చెప్పుకునే గ్రూప్ నాయకుడు అబూ బకర్ అల్-బాగ్దాదీ కూడా ఉన్నారు. సిరియా అధ్యక్షుడు అస్సాద్ వ్యతిరేక గ్రూపుల్లో అత్యంత ప్రమాదకరమైన, ప్రభావవంతమైన గ్రూపుగా దీనిని పరిగణిస్తారు. అయితే, ఈ గ్రూపు జిహాదీ సిద్ధాంతం తిరుగుబాటు ధోరణి కంటే ఆ గ్రూపును ముందుకు నడిపించే చోదకశక్తిగానే ఎక్కువగా కనిపిస్తుంది. సిరియా విముక్తి నినాదంతో ప్రధాన తిరుగుబాటు గ్రూపులన్నీ కూటమిగా ఏర్పడిన సమయంలోనూ, ఇది అందుకు విరుద్ధంగా కనిపించింది. 2016లో గ్రూపు నాయకుడు అబూ మొహమ్మద్ అల్ - జవ్లానీ అల్ ఖైదాతో బహిరంగంగా తెగదెంపులు చేసుకున్నారు. జభత్ అల్-నుస్రాను రద్దు చేసి, కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. ఏడాది తర్వాత, సారూప్య భావజాలం కలిగిన ఇతర గ్రూపులతో కలిసిన అనంతరం దాని పేరు హయత్ తహ్రీర్ అల్ -షామ్‌గా మారింది.
సిరియా ఎవరి నియంత్రణ ఆధీనంలో ఉంది?
గత నాలుగేళ్ల పరిణామాలను చూస్తే..సిరియా యుద్ధం దాదాపు ముగిసినట్టే అనిపించింది. దేశంలోని ప్రధాన నగరాలు అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నాయి.కానీ, సిరియాలోని కొన్ని ప్రాంతాలు మాత్రం ఇప్పటికీ ప్రభుత్వ నియంత్రణలో లేవు. సిరియా సంక్షోభం ప్రారంభ దశ నుంచే పెద్దగా ప్రభుత్వ నియంత్రణ లేని తూర్పుప్రాంతంలోని కుర్దిష్ మెజార్టీ ప్రాంతాలు వాటిలో ఉన్నాయి.2011లో అస్సాద్ ఫ్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైన దక్షిణాదిలో చెలరేగిన అశాంతిని అణచివేసినప్పటికీ,ఇప్పటికీ ఎంతోకొంత అశాంతి కొనసాగుతోంది.విశాలమైన సిరియా ఎడారి ప్రాంతంలో, తమను తాము ఇస్లామిక్ స్టేట్‌గా చెప్పుకునే గ్రూపుతో భద్రతాపరంగా ఇప్పటికీ ముప్పు పొంచివుంది. మరీముఖ్యంగా, ప్రజలు ఎక్కువగా అటువైపు వెళ్లే ట్రఫుల్ (ట్రఫుల్ అంటే ఫంగీ జాతికి చెందిన పుట్టగొడుగుల్లాంటి ఆహార పదార్థం) హంటింగ్ సీజన్‌లో ఈ ముప్పు ఎక్కువ. ఇక వాయువ్య ప్రాంతలోని, ఇద్లిబ్ ప్రావిన్స్‌లో జిహాదీ రెబల్ గ్రూపుల ప్రాబల్యం ఎక్కువ. ఇద్లిబ్‌లో ఆధిపత్యం సాగిస్తున్న గ్రూపుల్లో ఒకటైన హెచ్‌టీఎస్ ఇప్పుడు అలెప్పోపై ఆకస్మిక దాడులు మొదలుపెట్టింది.
అంతర్గతపోరు
సిరియన్ ప్రభుత్వ దళాలు ఇద్లిబ్‌పై తిరిగి నియంత్రణ సాధించడం కోసం ప్రయత్నించడంతో ఈ ప్రాంతం ఏళ్లపాటు రణరంగంగా మారింది. అయితే, అస్సాద్ ప్రభుత్వానికి కీలక మిత్రదేశమైన రష్యా,తిరుగుబాటుదారులకు మద్దతుగా ఉన్న తుర్కియే మధ్యవర్తిత్వంతో 2020లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.ఎట్టకేలకు తిరుగుబాటుదారులపై అస్సాద్ సైన్యం విజయం సాధించిన ఈ క్రూరమైన యుద్ధం కారణంగా,ఈ ప్రాంతంలోని పట్టణాలు, నగరాల నుంచి దాదాపు 40 లక్షల మంది ఒక చోటు నుంచి మరోచోటుకి తరలిపోయారు. అత్యంత రక్తపాతం చవిచూసిన యుద్ధభూముల్లో అలెప్పో కూడా ఒకటి. రెబల్స్‌కి ఎదురైన అతిపెద్ద ఓటముల్లోనూ ఇదొకటి. ఈ యుద్ధంలో విజయం కోసం అస్సాద్ ప్రభుత్వం రష్యా వైమానిక దళాలు, ఇరాన్ సైనిక సాయంపై ఆధారపడింది.ప్రధానంగా ఇరాన్ మద్దతుతో నడుస్తున్న మిలీషియా సంస్థల సాయం తీసుకుంది. వాటిలో హిజ్బుల్లా కూడా ఒకటి. అలెప్పోపై జిహాదీ రెబల్ గ్రూపుల ఆకస్మిక దాడి నిర్ణయానికి, ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లాకు గట్టి ఎదురుదెబ్బ తగలడం, సిరియాలో ఇరాన్ మిలిటరీ కమాండర్లపై ఇజ్రాయెల్ దాడులు చేయడం వంటివి కీలకపాత్ర పోషించి ఉండొచ్చన్న చిన్న సందేహం కూడా ఉంది.హెచ్‌టీఎస్ కొంతకాలంగా ఇద్లిబ్‌ను తమ అధికార కేంద్రంగా చేసుకుని, స్థానిక యంత్రాంగంతో పాలన సాగిస్తోంది. తమ పాలనకు చట్టబద్ధత కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ మానవ హక్కుల ఉల్లంఘనల కారణంగా అవి నెరవేరలేదు.హెచ్ టీఎస్‌కు ఇతర గ్రూపులతో అంతర్గత పోరు కూడా నడుస్తోంది.అయితే, ఇద్లిబ్‌పై హెచ్‌టీఎస్ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు.అల్ ఖైదాతో తెగదెంపులు చేసుకున్న నాటి నుంచి,సిరియాలో కాలిఫేట్ (ఇస్లాం మతరాజ్య స్థాపన) కంటే ఫండమెంటలిస్ట్ ఇస్లామిక్ రూల్ (సంప్రదాయ ఇస్లామిక్ పాలన) కోసం ప్రయత్నించడానికే అది పరిమితమైంది. గతంలో ఐఎస్ విఫలం కావడం కూడా అందుకు ఒక కారణం. సిరియా సంక్షోభాన్ని మళ్లీ రాజేసేందుకు, అస్సాద్ ప్రభుత్వాన్ని సవాల్ చేసేందుకు చేసిన ప్రయత్నాల్లో దీనిప్రభావం అంతంతమాత్రమే.
What's Your Reaction?