నిలువు దోపిడీకి కళ్లెం
గుంటూరు స్టూడియో భారత్ ప్రతినిధి

నిలువు దోపిడీకి కళ్లెం వేసిన గుంటూరు నగర కమిషనర్ కీర్తి చేకూరి..
వీధి వ్యాపారుల నుండి ఆశీలు వసూళ్లు నిలిపివేత..
ఆశీలు వసూలు నిలిపివేత గురించి కౌన్సిల్ తీర్మానం చేసిన కమిషనర్ కీర్తి చేకూరి..
గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ శనివారం చేసిన తీర్మానం మేరకు నగరంలో ప్రభుత్వం నుండి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వీధి వ్యాపారుల నుండి ఆశీలు వసూళ్లు చేయడం నిలిపివెయబడిందని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్ధ పరిధిలో స్ట్రీట్ వెండింగ్ విధానం అమలు, స్ట్రీట్ వెండింగ్ యాక్ట్ – 2014 ప్రకారం బైలాస్ తయారు చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపామని, ప్రభుత్వం నుండి తగు ఆమోదం వచ్చే వరకు నగరంలోని వీధి వ్యాపారుల నుండి ఎటువంటి ఆశీలు వసూళ్లు చేయకూడదని కౌన్సిల్ నిర్ణయం చేసిందన్నారు.
ప్రభుత్వం అనుమతి వచ్చిన తర్వాత సదరు పాలసీ మేరకు నిర్ణయించిన ఫీజులను నగరపాలక సంస్థ చేత ధ్రువీకరించిన వెండర్ నెలవారిగా వసూళ్లు చేయడం జరుగుతుందని, ప్రస్తుతం ఎవరైనా ఆసీలు వసూళ్లు చేస్తే వారి పై నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంలో ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
What's Your Reaction?






