పలు ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్
అమరావతి స్టూడియో భారత్ ప్రతినిధి
ఏపీలో ముగిసిన కేబినేట్ సమావేశం..పలు ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైసీపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్‌లో కేబినేట్ సమావేశం బుధవారం జరిగింది. మూడు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో పలు ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వైసీపీ సర్కార్.ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి కేబినేట్ ఆమోదం తెలిపింది.వైఎస్సార్ సున్నా వడ్డి పథకం అమలుకు..ఎస్ఐపీబీ నిర్ణయాలకు కూడా ఆమోదం తెలిపింది. అలాగే జనవనరుల శాఖలో పలు నిర్ణయాలకు కూడా గ్రీన్ ఇచ్చేశారు. అసైన్డ్ భూములపై అనుభవదారులకి సర్వ హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 20 సంవత్సరాలకు ముందు కేటాయించిన భూములకు సైతం హక్కులు కల్పించేలా నిర్ణయించారు.
అయితే కేబినేట్ భేటీ అనంతరం రాష్ట్ర మంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.జగనన్న సురక్ష అనే కార్యక్రమంపై ఆయన మంత్రులతో మాట్లాడనున్నారు.ఈ కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు
What's Your Reaction?