ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో అన్ని స్థానాలలో పోటీ చేస్తుంది
అమరావతి స్టూడియో భారత్ ప్రతినిధి
ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో అన్ని స్థానాలలో పోటీ చేస్తుంది
రాష్ట్ర ఆప్ అధికార ప్రతినిధి - డాక్టర్ టి.సేవకుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రం లోఉన్న 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ టి. సేవ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ, రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నిద్ధమవుతున్న నేపథ్యంలో డాక్టర్ టి. సేవకుమార్ ఆ ప్రకటన విడుదల చేస్తూ ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాలలో పార్లమెంట్ ,అసెంబ్లీ ఇన్చార్జిలను నియమించడం జరిగిందని ,త్వరలో పార్టీని బూత్ స్థాయికి ,ప్రజల్లోకి విసృతంగా తీసుకువెళ్తామన్నారు.
ఇది కూడా చదవండి..https://studiobharat.com/PIL-in-High-Court-on-Tiger-Nageswara-Rao.. దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి.
ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ ,ప్రజాసేవ చేసేవారికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందన్నారు.రాష్ట్రం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలు నిస్వార్ధంగా ఆలోచించి,దేశం,రాష్ట్రం దశ దిశ మార్చగలిగిన జాతీయ పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీకి సహకారం అందించాలని డాక్టర్ టి.సేవ కుమార్ ఆ ప్రకటనలో కోరారు.త్వరలో ఆప్ మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు.రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి యువత,మహిళలు,స్థానికులు ముందుకు రావాలని డాక్టర్ సేవకుమార్ విజ్ఞప్తి చేశారు.ఆసక్తిగలవారు 98 483 9 1212 నెంబర్ లో సంప్రదించవచ్చునన్నారు.-డాక్టర్ టి సేవకుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి ,ఆమ్ ఆద్మీ పార్టీ ,ఆంధ్ర ప్రదేశ్
What's Your Reaction?