తెలంగాణకు రెండో సీఎం గా రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ.... తెలంగాణ స్టూడియో భారత్ ప్రతినిధి
తెలంగాణకు రెండో సీఎం గా రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం ఎవరన్నది తేలిపోయింది.నరాలు తెగే ఉత్కంఠకు కాంగ్రెస్ తెరదీసింది. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే ఫైనల్ చేస్తూ అధికారికంగా ప్రకటించిన కేసి వేణుగోపాల్.తెలంగాణకు రేవంత్ రెడ్డి రెండో ముఖ్యమంత్రిగా నియామకం అయ్యారు.
ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లభించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 60 సీట్లు కావాల్సి ఉండగా..కాంగ్రెస్ కు ప్రజలు 64 సీట్లు కట్టబెట్టారు.బీఆర్ఎస్‌కు 39 సీట్లు,బీజేపీకి 8,ఎమ్ఐఎమ్‌కు 7,సీపీఐకి 1 స్థానాల్లో అవకాశం ఇచ్చారు.
ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ
అయితే,ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉండటంతో అధిష్టానం అందరితో రెండ్రోజుల పాటు సుధీర్ఘ మంతనాలు జరిపి రేవంత్ రెడ్డిని ఫైనల్ చేసింది.అంతేకాదు.. తెలంగాణ డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్కను ఎంపిక చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి సీఎంగా.. డిసెంబర్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
7వ తేదీన గురువారం మంచి ముహూర్తం ఉండటంతో పార్టీ ఆ రోజునే ఫైనల్ చేసింది.మరోవైపు రేవంత్ రెడ్డితో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఆసక్తిగా మారింది...
--మిగ్ జాం తుపాను జల ప్రళయంలో తమిళనాడు ....చదవండి.. https://studiobharat.com/Tamil-Nadu-under-Migjam-storm-water-deluge ....దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి...
What's Your Reaction?