మాదకద్రవ్యాలకు అడ్డాగా ప్రైవేట్ యూనివర్సిటీలు

మంగళగిరి స్టూడియో భారత్ ప్రతినిధి

Jul 11, 2023 - 13:21
Jul 11, 2023 - 13:23
 0  31
మాదకద్రవ్యాలకు అడ్డాగా ప్రైవేట్ యూనివర్సిటీలు

మాదకద్రవ్యాలకు అడ్డాగా ప్రైవేట్ యూనివర్సిటీలు,కళాశాలలు

  • మత్తులో జోగుతున్న విద్యార్థులు
  • పట్టించుకోని యాజమాన్యాలు
  • ఆందోళనలో తల్లిదండ్రులు

మంగళగిరి:

నగర పరిధిలోని పలు ప్రైవేట్ యూనివర్సిటీలు,కళాశాలలు మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారాయి.ప్రధానంగా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం లో గల KL యూనివర్సిటీ,నీరుకొండలో గల ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లతో పాటు మరికొన్ని ప్రైవేటు కళాశాలలు సైతం మాదకద్రవ్యాలకు అడ్డాలుగా మారడం ఆందోళన కలిగిస్తోంది.ఇటీవల జరిగిన ఘటనలు నగరంలో సంచలనాన్ని సృష్టించాయి.తాజాగా KL యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ ఎస్ఈ బి అధికారులకు పట్టు పడడం సంచలనాన్ని రేకెత్తించింది.

అయితే ఎస్ఈబీ అధికారులు సైతం తూతూ మంత్రంగా నెలకో,రెండు నెలలకి ఒకరిద్దరిని పట్టుకుని ఏదో సాధించామని చెప్పుకోవడమే కానీ పూర్తిస్థాయిలో గంజాయిని అరికట్ట లేకపోతున్నారనేది పచ్చినిజం.కొద్దికాలం క్రితం నగరంలోని టిప్పర్ల బజారులో గల చైతన్య కాలేజీకి చెందిన విద్యార్థి మాదక ద్రవ్యాలు తీసుకుని వీరంగం సృష్టించడం అప్పట్లో సంచలనాన్ని కలిగించడంతో కేసు నమోదైంది.ప్రైవేటు మెడికల్ షాపుల్లో సైతం మత్తు బిళ్ళలు విక్రయం జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టీ పట్టనట్లుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

తాజాగా గత కొద్ది రోజుల క్రితం నీరుకొండ లో గల యూనివర్సిటీలో కొందరు విద్యార్థులు మత్తులో కొట్టుకున్న ఘటన జరిగినా యాజమాన్యం బయటకు పొక్కనివవ్వకుండా జాగ్రత్తలు పడిందని తెలిసింది.ఆయా యూనివర్సిటీలు,కళాశాలల్లో కొందరు విద్యార్థులు మాదక ద్రవ్యాలు నిత్యం విచ్చలవిడిగా వినియోగిస్తున్నా యాజమాన్యాలు పట్టించుకోవడంలేదనే విమర్శలు లేకపోలేదు.ఇక కార్పొరేషన్ పరిధి చినకాకాని ఎన్నారై మెడికల్ కళాశాలలో కొందరు విద్యార్థులు సైతం పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో నిత్యం గంజాయిని సేవిస్తున్నారని తెలిసింది.కాగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంటుందని ఎస్ఈబీ జేడీ మహేష్ తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow